యూఐడీఏఐ ఆధార్ కార్డులో కొత్త మార్పులు తీసుకొచ్చింది. పర్సనల్ ప్రైవసీ, ప్రొటెక్షన్ కోసం క్యూఆర్ కోడ్ సిస్టంని బిల్డ్ చేసింది.

కొత్త ఆధార్ వెర్షన్‌లో పూర్తి పేరు, నెంబర్ క్లియర్ గా కనిపించకపోవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే డిజిటల్ స్కాన్ ద్వారా వివరాలు పొందవచ్చు. 

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే అసలు వివరాలు బయటపడతాయి. దీంతో  యూజర్స్ డేటా మిస్ యూజ్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది.

ఆధార్ కార్డు మీద ఇన్ఫర్మేషన్ లిమిటెడ్ డిస్ప్లే ఉంటుంది. సేఫ్టీ స్టాండర్డ్స్ పెంచేందుకు యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రైవసీ ప్రొటెక్షన్ కి ఇది పెద్ద అడుగుగా నిపుణులు భావిస్తున్నారు. పర్సనల్ డీటెయిల్స్ అనవసరంగా షేర్ అవకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఆన్‌లైన్ వేరిఫికేషన్ ప్రాసెస్ మరింత సేఫ్ గా మారుతుంది.  అన్ని సర్వీసుల్లో క్యూఆర్ బేస్డ్ వేరిఫికేషన్ తో ఇన్స్టంట్ ఐడెంటిఫికేషన్ సాధ్యమవుతుంది.

ఆధార్ యూజర్లు తమ కార్డును సేఫ్ గా ఉంచుకోవాలి. అఫీషియల్ యాప్ ద్వారా మాత్రమే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని సూచిస్తున్నారు.