ఆరకిల్ కంపెనీ షేర్లు 50% డౌన్ అయ్యాయి సుమారు 463 బిలియన్ డాలర్ల మార్కెట్ నష్టం. ఇది AI బబుల్ బరస్ట్ కు మొదటి సంకేతమని నిపుణులు చెబుతున్నారు.
ట్రిలియన్ల డాలర్లు డేటా సెంటర్లు, చిప్స్‌పై ఖర్చు పెట్టారు. కానీ వాస్తవ లాభాలు, రాబడి అనిశ్చితంగా ఉన్నాయి. బబుల్ పేలితే భారీ నష్టాలు తప్పవు.
NVIDIA, OpenAI వంటి దిగ్గజాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పరిశ్రమలో అస్థిరత పెరిగి, నమ్మకం తగ్గుతోంది. ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.
గూగుల్ CEO సుందర్ పిచాయ్, అమెజాన్ CEO బెజోస్ AIలో బబుల్ అంశాలు ఉన్నాయని చెప్పారు. బబుల్ బరస్ట్ అయితే ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు
AI హైప్ భారీగా ఉన్నా, ప్రొడక్టివిటీలో గణనీయమైన మార్పు కనిపించడం లేదు. కంపెనీలు లాభాలు చూపించలేకపోతున్నాయి.
AI జనరేటెడ్ డేటాపై మోడల్స్‌కు శిక్షణ ఇస్తే నాణ్యత తగ్గుతోంది. మోడల్స్ దెబ్బతిని, తప్పులు పెరుగుతున్నాయి. పరిశ్రమకు ఇది పెద్ద ఇబ్బంది.
AI శిక్షణకు కాపీరైట్ డేటాను ఉపయోగించడం వల్ల బిలియన్ల డాలర్ల కేసులు వస్తున్నాయి. ఇది పరిశ్రమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.
AI డేటా సెంటర్లకు హెవీ ఎలక్ట్రిసిటీ అవసరం. ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ పెరిగి, సస్టైనబుల్ కాకుండా పోతోంది. ఖర్చులు మరింత పెరుగుతున్నాయి.
AI వల్ల మిలియన్ల ఉద్యోగాలు పోవచ్చు. భారీ నిరుద్యోగ సమస్య ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ ఇంపాక్ట్ కూడా హెవీగా ఉంటుంది.
లాభాలు లేని AI స్టార్టప్‌లకు బిలియన్ల వాల్యుయేషన్ ఇస్తున్నారు. ఇది డాట్‌కామ్ బబుల్‌ను పోలి ఉండి, బరస్ట్ కి దారితీస్తోంది.