సోకొత్రా దీవి (యెమన్)

సోకొత్రా దీవిలో పూలు, చెట్లు ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఉంటాయి. ఇక్కడి డ్రాగన్ బ్లడ్ ట్రీ వంటి వింత జీవావరణంతో ఇది ఎలియాన్ వరల్డ్ లా అనిపిస్తుంది.

సాలార్ డి ఉయుని (బొలీవియా)  

ఇది ప్రపంచపు అతిపెద్ద ఉప్పు మైదానం. వర్షాకాలంలో వాటర్ రేఫ్లేక్షన్ వల్ల ఆకాశమే నేలపై పడినట్లు కనిపిస్తుంది. పూర్తిగా అద్దంలా మారుతుంది.

నామిబ్ ఎడారి (నమీబియా)  

ఎర్రటి ఇసుకతో నిండి ఉండే ఈ ఎడారి, మృదువుగా వంగిన ఎండిపోయిన చెట్లు చూడటానికి ఇది ఎలియన్ ల్యాండ్ ని తలపిస్తుంది.

ఆంటిలోప్ క్యాన్యాన్ (USA)

అమెరికాలోని ఈ రాతి గుహలు కాంతి ప్రసరించి  అద్భుతంగా మెరిసిపోతూ ఎలియన్ మిషన్ సెట్స్‌లా అనిపిస్తాయి.

పాముక్కలే (టర్కీ) 

హాట్ స్ప్రింగ్స్ తో నిండిన తెల్లటి వలయాలతో కూడిన ఈ ప్రదేశం చూడటానికి ఇది ఒక ఏలియన్స్ స్పా లా కనిపిస్తుంది.

వావా వోల్కేనో (ఎథియోపియా)  

వేడి వేడి లావాతో ఎప్పుడూ పొంగిపొర్లే ఈ అగ్నిపర్వతం చుట్టూ కలర్ ఫుల్ కెమికల్స్ తో నిండి ఉండి ఎలియన్ స్పేస్ మిషన్ ని తలపిస్తుంది.

రైన్బో మౌంటెన్స్ (చైనా)

జాంగ్యే డాన్‌షియా పర్వతాలు వేర్వేరు రంగుల్లో ఉండటంతో చూడటానికి ఇవి ప్రకృతిలో ఉండే మామూలు ప్రదేశంగా కాక, ఎలియన్ ఆర్ట్ లా కనిపిస్తాయి. 

వట్నాజోకుల్ గ్లేసియర్ కేవ్స్ (ఐస్‌లాండ్‌) 

ఈ గ్లేసియర్ లోపల క్రిస్టల్ బ్లూ టన్నెల్స్ ఉండటం వల్ల ఇవి బ్లూ కలర్ గెలాక్సీకి గేట్వే లా కనిపిస్తాయి.

లెన్సోయిస్ మారన్హెన్సెస్ (బ్రెజిల్)

వెచ్చని ఇసుక మైదానాల్లో నీటి కొలనులు ఏర్పడటం వల్ల ఇది నీటితో నిండిన ఒక వింత, ఎడారిలా మారుతుంది.

అటాకామా ఎడారి (చిలీ) 

ఈ ఎడారి ఎప్పుడూ పొడిగా ఉంటుంది. నేలపై రంగురంగుల ఖనిజాలు,  క్రేటర్లు ఉండటం వల్ల ఇది చంద్రునిపై ఉందేమో అనిపిస్తుంది.