అసోంలోని సడియా ప్రాంతంలోని జ్యోతిష్ నగర్‌లో తవ్వకాల సమయంలో పాతకాలానికి చెందినట్టుగా కనిపిస్తున్న ఒక రహస్య నిర్మాణం అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చింది.

ఈ డిస్కవరీ గ్రామ పెద్ద రాజెన్ గొగోయ్ ఇంటి వద్ద స్తంభాల కోసం గుంత తవ్వుతున్న కార్మికులకు అనుకోకుండా కనిపించింది.

భూమి ఉపరితలం నుంచి సుమారు ఎనిమిది అడుగుల లోతులో ఈ నిర్మాణం బయటపడింది. ఇది స్థానికుల్లో ఇప్పుడు భారీ ఆసక్తి రేపింది.

కాల్చిన మట్టితో అనేక రకాల లేయర్స్ తో నిర్మించిన బావిలాంటి ఆకారంలో ఈ నిర్మాణం కనిపించింది. దీనికి  చారిత్రక ప్రాధాన్యం ఉండొచ్చని భావిస్తున్నారంతా.

నిర్మాణ శైలి సాధారణమైనది కాదని, ఎంతో జాగ్రత్తగా రూపొందించిన పొరలు కనిపించడంతో ఇది గతకాలపు ఇంజనీర్ల కళాకృతికి నిదర్శనం అని భావిస్తున్నారు. 

ఇది నిజంగా బావేనా, లేక వేరే అవసరానికి వాడిన నిర్మాణమా అన్నది పూర్తిస్థాయి పరిశోధన తర్వాత మాత్రమే స్పష్టమవుతుందని స్థానికులు చెబుతున్నారు.

తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయని, అదే ప్రదేశంలో మరిన్ని పురావస్తువులు లేదా ఆధారాలు బయటపడే అవకాశముందని గ్రామ ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

ఈ డిస్కవరీతో సడియా ప్రాంతపు చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై కొత్త చర్చ మొదలైంది. స్థానికులలో ఉత్సాహం మరింత పెరిగింది.

సరైన పురావస్తు పరిశీలన జరిగితే ఈ నిర్మాణం ఆ ప్రాంతపు గత నాగరికతల జీవనశైలి, నీటి వినియోగం, నిర్మాణ నైపుణ్యంపై సంకేతాలు ఇవ్వొచ్చని భావిస్తున్నారు.

జ్యోతిష్ నగర్‌లో బయటపడిన ఈ రహస్య నిర్మాణం సడియా చరిత్రలో కొత్త అధ్యాయం తెరవొచ్చని, తదుపరి తవ్వకాలపైనే అందరి చూపు నిలిచిందిప్పుడు.