పక్షుల రెక్కల నిర్మాణాన్ని గమనించి మనిషి విమానాలను రూపొందించాడు.  ఆ ఆలోచనే ప్రపంచాన్ని కలిపే ఎయిర్ ట్రావెల్ గా మారింది.

పక్షుల రెక్కల నిర్మాణాన్ని గమనించి మనిషి విమానాలను రూపొందించాడు.  ఆ ఆలోచనే ప్రపంచాన్ని కలిపే ఎయిర్ ట్రావెల్ గా మారింది.

కింగ్‌ఫిషర్ పక్షి ముక్కు ఆకారాన్ని ఆధారంగా తీసుకుని బుల్లెట్ ట్రెయిన్ ముందుభాగాన్ని రూపొందించారు. దీంతో శబ్దం తగ్గి వేగం, ఇంధన సామర్థ్యం పెరిగింది 

కుక్కల ముక్కు వాసన శక్తి శాస్త్రవేత్తలకు సెన్సింగ్ పరికరాల అభివృద్ధికి ప్రేరణ ఇచ్చింది. ప్రమాదకర పదార్థాల గుర్తింపులో ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. 

షార్క్  చర్మాన్ని చూసి వేగంగా ఈదే స్విమ్‌సూట్లు, జ యాంటీబాక్టీరియల్ మెటీరియల్స్ రూపొందించారు. ఇవి వేగం, పరిశుభ్రత రెండింటినీ మెరుగుపరుస్తాయి.

తామర ఆకుపై నీరు జారిపడే లక్షణాన్ని చూసి సెల్ఫ్ క్లీనింగ్ పెయింట్లు, గ్లాస్ వంటివి తయారయ్యాయి. ధూళి అంటకుండా ఉంచే స్మార్ట్ ఉపరితలాలకిదే ఆధారం.

దోమ సూది లాంటి తన సన్నని ముక్కు చూసి వైద్య చికిత్సలో తక్కువ నొప్పి కలిగించే సూదులు అభివృద్ధి చేశారు. 

చీమల సమూహం కదలికలు, సహకార విధానాన్ని అధ్యయనం చేసి రోబోటిక్స్ మరియు  ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అల్గారిథమ్‌లు రూపొందించారు. 

గెక్కో పాదాలకున్న అతుక్కొనే శక్తిని చూసి గ్లూ లేకుండానే అంటుకునే టేపులు, క్లైంబింగ్ పరికరాలు అభివృద్ధి చేశారు. 

స్పైడర్ సిల్క్ బలాన్ని చూసి తేలికగా ఉండే సింథటిక్ ఫైబర్లు తయారు చేసే పరిశోధనలు ప్రారంభమయ్యాయి. రక్షణ రంగానికీ ఇవి ఉపయోగపడుతున్నాయి.