ఇవి కాలనీలని నిర్మిస్తాయి. అందులో రాణి ఈగ పెట్టిన గుడ్లని కాపాడటానికి, పుట్టే పిల్లలకి ఆహారం సేకరించటానికి కార్మిక తేనెటీగలు నిరంతరం టీం వర్క్ చేస్తూనే ఉంటాయి.
ఇవి సమూహంగా వేటాడుతూ, ఆహారాన్ని పంచుకుంటాయి. గాయపడిన తోటి జంతువుని సంరక్షిస్తూ, పిల్లలను రక్షించడంలో అద్భుతమైన టీమ్‌వర్క్ చేస్తాయి.
డాల్ఫిన్లు
డాల్ఫిన్లు సముద్రంలో జట్టుగా ప్రయాణించి, సమిష్టిగా వేటాడతాయి. ప్రమాదం వస్తే ఒకదానిని మరొకటి కాపాడుతుంది.
మీర్కట్స్
మీర్కట్స్ వాచ్ గార్డులుగా వ్యవహరిస్తూ ఇతరులకు రాబోయే అపాయం గురించి ముందే హెచ్చరిస్తాయి. వారి కుటుంబాన్ని సంరక్షించడంలో సహకరిస్తాయి.
చీమలు
చీమలు అద్భుతమైన క్రమశిక్షణతో పనిచేసే శ్రమ జీవులు . ఆహారం కోసం గుంపులుగా వెళతాయి, అంతేగాక బలమైన కాలనీలను నిర్మిస్తాయి.
ఏనుగులు
ఏనుగులు తమ గుంపులో సహచరులను ప్రేమగా చూసుకుంటాయి. వాటి బిడ్డలను సంరక్షిస్తాయి, గాయపడినవారిని వదలకుండా తోడుంటాయి.
వేవ్-రైడింగ్ బర్డ్‌లు
ఈ పక్షులు V ఆకారంలో పయనిస్తూ శక్తిని ఆదా చేస్తాయి. ఒకదాని వెనుక మరొకటి ఎగిరి గాలి ఒత్తిడిని తగ్గించుకుంటాయి.
హైనాలు
వేటలో హైనాలు సమిష్టిగా ఒక ప్లాన్ ప్రకారం పనిచేస్తాయి. సమూహంగా వేటాడుతూ, పూర్తిగా ఆహారం పంచుకుంటాయి.
ఓర్కాస్
ఓర్కాస్ సముద్రంలో చురుకైన వేటగాళ్లు. ఇవి గుంపులుగా వేటాడుతూ వ్యూహాత్మకంగా పనిచేస్తాయి. జట్టుగా జీవించి, ఆహారాన్ని పంచుకుంటూ అద్భుతమైన సమన్వయం చూపిస్తాయి.