లెమూర్లు రోజుకు 16 గంటలకుపైగా నిద్రిస్తాయి. వీటి శరీరం ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటుంది. అటవీ వాతావరణం వీటికి సేఫ్టీ ప్లేస్ కావటం వల్ల ఎక్కువ నిద్రిస్తాయి.
పైథాన్స్
పైథాన్స్ ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత రోజుకు 18 గంటలవరకు నిద్రిస్తాయి. వీటిలో మెటబాలిజం నెమ్మదిగా జరిగటం వలన ఇవి ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటాయి.
టైగర్
పులులు రోజుకు సగటున 16 గంటలకుపైగా నిద్రిస్తాయి. ఇది దాని శక్తిని తిరిగి పొందటం ఎంతైనా అవసరం. అందుకే వేట తరువాత ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటాయి.
బ్రౌన్ బేర్
శీతాకాలం సమయంలో ఎలుగుబంట్లు హైబర్నేషన్లో రోజుకు 20 గంటలకుపైగా నిద్రిస్తాయి. శరీర శక్తిని నిలుపుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
ఒపోసమ్
ఒపోసమ్ రోజుకు 18 గంటలకుపైగా నిద్రిస్తుంది. ఇది చాలా సున్నితమైన జీవి కావడం వల్ల ఎక్కువగా దాగి ఉండి నిద్రలో గడిపే అలవాటు ఉంటుంది.
పిల్లి
పిల్లులు సగటున 13-16 గంటల నిద్ర పడతాయి. వీటికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కాబట్టి ఎక్కువ నిద్రిస్తాయి. చిన్నగా ఉన్నా ఎక్కువతో నిద్రిస్తాయి.
నక్కలు
నక్కలు సగటున రోజుకు 13-15 గంటలకుపైగా నిద్రిస్తాయి. ఇవి రాత్రిపూట చురుకుగా ఉండటం వల్ల, పగలంతా విశ్రాంతి తీసుకుంటాయి.
చింపాంజీలు
చింపాంజీలు సగటున 9-13 గంటలు నిద్రిస్తాయి. వీటి మెదడు పనిచేసే విధానం మనుషులకు దగ్గరగా ఉండటం వల్లవీటికి ఎక్కువ నిద్ర అవసరమవుతుంది.
కవ్వాలు
కవ్వాలు రోజుకు సుమారు 20-22 గంటలు నిద్రిస్తాయి. యూకలిప్టస్ ఆకులను జీర్ణించేందుకు వీటి శరీరానికి ఎక్కువ విశ్రాంతి అవసరం.
గబ్బిళాలు
గబ్బిళాలు ప్రధానంగా రాత్రిపూట చురుకుగా ఉంటాయి. పగలు 18-20 గంటల వరకు నిద్రిస్తాయి. ఇవి గుహల్లో తల్లక్రిందులుగా వేలాడుతూ విశ్రాంతి తీసుకుంటాయి.