స్పేస్ జర్నీ ద్వారా 50 ఏళ్ల తర్వాత చంద్రుడి చెంతకు మానవులను తీసుకెళ్లిన తొలి నాసా మిషన్ ఆర్టెమిస్ II.
ఈ జర్నీలో రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్ మరియు జెరెమీ హాన్సెన్ అనే నలుగురు ఆస్ట్రోనట్స్ పాల్గొన్నారు.
ఏప్రిల్ 1, 2026న స్టార్ట్ అయిన ఈ 10 రోజుల స్పేస్ జర్నీ, ఏప్రిల్ 10న పసిఫిక్ మహాసముద్రంలో సేఫ్ గా ల్యాండ్ అయింది.
1. ఈ మిషన్ ద్వారా భూమి నుండి సుమారు 4,06,771 కిలోమీటర్ల దూరం జర్నీ చేసి, మానవ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు.
ఆర్టెమిస్ II మిషన్ లో భాగంగా ఇప్పటివరకు మానవులెవరూ చూడని చంద్రుడి వెనుక భాగాన్ని ఈ ఆస్ట్రోనట్స్ డైరెక్ట్ గా చూశారు.
ఆర్టెమిస్ II వ్యోమగాములు నిజంగా దేవుడిని చూశామని చెప్పలేదు; కానీ చంద్రయాత్ర తర్వాత కలిగిన ఆధ్యాత్మిక అనుభూతి మాటల్లో చెప్పలేనిదని తెలిపారు.
అంతరిక్షం నుంచి విక్టర్ గ్లోవర్ బైబిల్లోని వాక్యాలైన "దేవుడిని ప్రేమించండి, మీ పొరుగువారిని ప్రేమించండి" అనే క్రీస్తు బోధనను ఆయన చంద్రుడి చెంత నుంచి ప్రపంచానికి గుర్తు చేశారు.
శూన్యమైన అంతరిక్షంలో భూమి ఒక అందమైన ఒయాసిస్ లాగా, దేవుడు మనకోసం సృష్టించిన ఆవాసంలా ఉందని గ్లోవర్ అభివర్ణించారు.
యాత్ర ముగించుకుని భూమికి తిరిగి రాగానే, ఒక నావికాదళ చాప్లిన్ ధరించిన క్రాస్ గుర్తును చూసి కమాండర్ రీడ్ వైజ్మాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అంతరిక్షం నుంచి అద్భుతమైన సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూడటం కీర్తనలు గుర్తుకు తెచ్చాయని వ్యోమగాములు తెలిపారు.
అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు కలిగే ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభూతినే 'ఓవర్వ్యూ ఎఫెక్ట్' అంటారు, ఇది వ్యోమగాముల్లో ప్రపంచం పట్ల అవగాహనను పెంచుతుంది.
కొందరికి ఇది శాస్త్రయాత్ర; మరికొందరికి ఐది ఆత్మను కదిలించే క్షణం. కానీ ఎవ్వరూ “మేము దేవుడిని చూశాం” అని చెప్పలేదు.
ఈ స్టోరీ వెనుక అసలు ఉద్దేశ్యం దేవుడిని కళ్లతో చూడటం కాదు; విశ్వాన్ని చూసి మనిషి స్పిరిచ్వాలిటీని లోతుగా అనుభవించడం అని వారు సూచించారు.
కాబట్టి ఇక్కడ ప్రశ్న “వారు దేవుడిని చూశారా?” అనే కంటే, “ఆ యాత్ర వారికి దేవుని గురించి కొత్తగా ఆలోచింపజేసిందా?” అనేదే ఎక్కువ ఆసక్తికరం.