2026 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఆర్టెమిస్ II, అపోలో 17 తర్వాత చంద్రుడి వైపు మనుషులను తీసుకెళ్లిన తొలి మిషన్‌గా చరిత్ర సృష్టించింది.
ఈ బృందంలో రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ ఉన్నారు; వీరంతా కలిసి మానవాళిని మళ్లీ చంద్రుడి వైపుకి నడిపించారు.
భూమి నుంచి 252,756 మైళ్ల దూరం చేరిన ఒరియన్, అపోలో 13 రికార్డును దాటి మానవ అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచింది.
చంద్రుడి వెనుక భాగం ఆర్బిట్ చేసే సమయంలో సుమారు 40 నిమిషాల కమ్యూనికేషన్ బ్లాకౌట్ ఏర్పడింది; తిరిగి కమ్యూనికేట్ అయిన క్షణం ఉత్కంఠ రేపింది ప్రపంచవ్యాప్తంగా అందరినీ కట్టిపడేసింది.
కారణం వ్యోమగాములు చంద్రుని సమీపం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడటమే. సూర్యుని కరోనా అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించారు చరిత్రలో ఇది అరుదైన క్షణంగా మిగిలింది.
చంద్రుడి ఫార్ సైడ్ మీదుగా ట్రావెల్ చేస్తూ, ఈ టీమ్ ఒరియెంటేల్ బేసిన్ వంటి విశాల క్రేటర్లు, కఠిన భూప్రకృతి, వింత రంగుల ఉపరితలం చూశారు.
హై పెర్ఫార్మెన్స్ కెమెరాలు, స్మార్ట్ఫోన్లతో వాళ్ళు ఈ దృశ్యాన్ని క్యాప్చర్ చేశారు; దీనికి సంబందించిన ముఖ్యమైన డేటా కూడా సేకరించారు.
ఇది ల్యాండింగ్ మిషన్ కాదు; చంద్రుడి గ్రావిటీని ఉపయోగించే ఫ్రీ-రిటర్న్ మార్గంతో ఒరియన్ సేఫ్ గా భూమి వైపు మళ్లింది.
ఆర్టెమిస్ II, అపోలో 17 తర్వాత వచ్చిన తొలి మానవ చంద్రయానం కావడంతో, నాసా భవిష్య చంద్ర లక్ష్యాలకు బలమైన పునాది వేసింది.
సుమారు 10 రోజుల ఈ టెస్ట్ ఫ్లైట్, పసిఫిక్ సముద్రంలో స్ప్లాష్‌డౌన్‌తో ముగిసి, భవిష్య చంద్రయానాల ముందు నాసాకు కీలక విశ్వాసాన్ని అందిస్తోంది.