అట్లాంటిస్ అనేది పురాతన నాగరికతకు నిలయమైన ఓ నగరం. ఇది జిబ్రాల్టర్ జలసంధికి సమీపంలో ఉన్న హెర్క్యులస్ స్తంభాల ముందు ఉన్నట్లు ఆధారాలు చెప్తున్నాయి
ప్లేటో చెప్పిన కథ
గ్రీకు తత్వవేత్త ప్లేటో క్రీస్తు పూర్వం 360లో అట్లాంటిస్ గురించి మొదటగా వివరించాడు. ఇది ఉనికిని కోల్పోయిన అత్యంత శక్తివంతమైన నాగరికతగా వర్ణించాడు
ఎక్కడ ఉంది ఈ నగరం?
అట్లాంటిస్ స్థానం ఇప్పటికీ ఒక మిస్టరీ. ఇది అట్లాంటిక్ సీ , కరేబియన్ సీ, లేదా అంటార్కిటికా సీ వీటిలో ఎక్కడో ఒకచోట ఉండవచ్చట. కానీ ఖచ్చితమైన ఆధారాలు లేవు.
ఏ సందర్భంలో మునిగింది?
ప్లేటో ప్రకారం, అత్యంత ధనవంతులైన ఇక్కడి ప్రజలు దురాశకి లోనవ్వటంతో దేవతలకి కోపం వచ్చి ఒక్కరోజులో ఈ నగరాన్ని సముద్రంలోకి నెట్టేశారు అని చెప్తాడు
శాస్త్రవేత్తల అభిప్రాయం
అత్యంత శక్తివంతమైన నగరంగా ఉన్నా కూడా శాస్త్రవేత్తలు దీనిని కేవలం ఒక పురాణ కథగా పరిగణిస్తున్నారు. ఆధారాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
ఆధునిక అన్వేషణలు
సాంకేతికంగా ఆధునిక సాధనాలతో అనేక మంది మెరైన్ రీసర్చర్స్ అట్లాంటిస్‌ను వెతికారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి నిర్ధారిత స్థలం దొరకలేదు.
నిజమా? కలా?
అట్లాంటిస్ నగరం నిజంగా ఉందా అన్నది ఇంకా చర్చనీయాంశమే. ఇది నిజం అయితే అది చరిత్రను మళ్లీ రాయించగలదు, లేకపోతే కేవలం పురాణం మాత్రమే.