లోకకంటకురాలైన మహిషిని అంతం చేయడానికి శివకేశవుల అంశతో అయ్యప్ప స్వామి జన్మించారు. దుష్టశిక్షణే ఆయన ప్రధాన లక్ష్యం.
లోక కల్యాణం కోసం, భక్తుల కోరికలు తీర్చడం కోసం అయ్యప్ప స్వామి నిత్యం తపస్సులో ఉంటూ నైష్టిక బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు
మహిషి శాపవిమోచనం పొంది మాళికాపురత్తమ్మగా మారి, తనను ఎలాగైనా వివాహం చేసుకోమని అయ్యప్ప స్వామిని వేడుకుంది.
తన వద్దకు వచ్చే కన్నెస్వాములు ఆగిపోయినప్పుడే వివాహం చేసుకుంటానని అయ్యప్ప స్వామి ఆమెకి ఒక షరతు విధించారు.
ప్రతి ఏటా వేల సంఖ్యలో కన్నెస్వాములు శబరిమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూనే ఉన్నారు. అందుకే ఆ వివాహం ఇప్పటికీ జరగలేదు.
శబరిమల కొండల్లో అయ్యప్ప స్వామి యోగ ముద్రలో ఉండి, తన తపో శక్తిని ఎల్లవేళలా తన భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటారు.
అయ్యప్ప స్వామి స్వయంగా బ్రహ్మచారి కాబట్టే, భక్తులు కూడా 41 రోజుల పాటు కఠిన బ్రహ్మచర్యం పాటిస్తూ మాల వేస్తారు.
ధర్మశాస్త్రగా ఆయన ధర్మాన్ని రక్షించేందుకు తన వ్యక్తిగత సుఖాలను సైతం త్యాగం చేసి లోక రక్షణకే అంకితమయ్యారు.
మాళికాపురత్తమ్మ భక్తికి మెచ్చిన స్వామి, ఆమెకు తన పక్కనే వెలసి పూజలు అందుకునే భాగ్యాన్ని ప్రసాదించారు.