నార్ధర్న్ కార్డినల్

ఎరుపు రంగుతో ఆకర్షించే ఈ పక్షి, తన మధురమైన గాత్రంతో పరిసరాలని  ప్రశాంతంగా ఉంచుతుంది. దీనిని పాజిటివ్‌ వైబ్‌వ్ గా కూడా భావిస్తారు.

బ్లూ జే

తెల్లని నీలి రెక్కలతో కనిపించే ఈ పక్షి, తెలివితేటలకి ప్రసిద్ధి. గింజలు, పండ్లు తినడం వల్ల పంటలకు ఇది ఎంతో ఉపయోగకరం. 

అమెరికన్  గోల్డ్ ఫించ్

పసుపు రంగుతో మెరిసే ఈ పక్షి, సన్ ఫ్లవర్స్ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. కలర్‌తో పాటు చిలిపి స్వభావంతో ఆకట్టుకుంటుంది.

బ్లాక్‌క్యాప్డ్ చిక్‌డి

చిట్టిదైనా మస్త్ ఎనర్జీతో ఉండే ఈ పక్షి, తన మధురమైన కుకులతో గ్రీన్ స్పేస్‌లో జీవాన్ని నింపుతుంది.

మౌర్నింగ్ డవ్

శాంతియుత గాత్రంతో, ప్రేమతో జంటగా సంచరించే ఈ పావురాలు ఇంటి వద్ద శుభప్రదంగా కనిపిస్తాయి. గడ్డిని తినే నైజంతో ఉన్నాయి. 

డౌనీవుడ్‌పీకర్

చెక్కల్లో దూరి పురుగులను తిని వృక్షాలకు రక్షణ కలిగించే ఈ పక్షి, చెట్ల దగ్గర పెద్దగా వినిపించే 'టక్ టక్' శబ్దంతో గుర్తించవచ్చు.

రెడ్ వింగ్డ్ బ్లాక్‌బర్డ్

నల్ల శరీరంపై ఎరుపు, పసుపు రెక్కలతో కనిపించే ఈ పక్షి, చెరువుల దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది.

హౌస్ ఫించ్

ఇల్లు, లేదా గార్డెన్ల దగ్గర కలర్‌ఫుల్‌గా కనబడే ఈ పక్షి, గింజలు, పండ్లపై ఆశ పడుతుంది. తక్కువ శబ్దంతో గుండెను హత్తుకొనే పాటలు పాడుతుంది.

టూ ఫిట్ హెమింగ్‌బర్డ్

సూపర్ ఫాస్ట్ రెక్కలతో పూల నుండి తేనె తాగే ఈ చిన్న పక్షి, కళాత్మకంగా గార్డెన్‌ను జీవన్మయంగా చేస్తుంది.