టర్కీలోని కప్పడోసియా ప్రాంతంలో వేల సంవత్సరాల క్రితం రాళ్లలో చెక్కిన గుహ ఇళ్లు ఉన్నాయి. ఇవి ఇప్పటికీ హోటళ్లుగా ఉపయోగిస్తున్నారు.
ట్యునీషియాలోని మాట్మాటా గ్రామంలో నేలలో తవ్విన గుహ ఇళ్లు ఉంటాయి. ఎండ వేడిని తగ్గించేందుకు వీటిని ప్రత్యేకంగా నిర్మించారు.
స్పెయిన్‌లోని సెటెనిల్ గ్రామంలో భారీ రాళ్ల కింద గుహలుగా ఇళ్లు నిర్మించారు. సహజంగా ఏర్పడిన రాళ్లు ఈ ఇళ్ళకి పైకప్పుల్లా కాపాడుతాయి.
ఆస్ట్రేలియాలోని కోబర్ పెడిలో ఎడారి వేడి నుండి రక్షణ కోసం భూమిలో గుహ ఇళ్లు నిర్మించారు. ఇవి చాలా కూల్ గా ఉంటాయి.
అమెరికాలోని మెసా వెర్డే ప్రాంతంలో పురాతన ప్రజలు పర్వత గుహల్లో ఇళ్లు నిర్మించారు. ఇవి చారిత్రక వారసత్వంగా ప్రసిద్ధి పొందాయి.
ఇటలీలోని మటేరా నగరంలో గుహల్లో నిర్మించిన ఇళ్లు ఉన్నాయి. ఇవి యూరప్‌లోని అత్యంత పురాతన నివాసాల్లో ఒకటి.
చైనాలోని లాంగ్మెన్ గుహలు రాతిలో చెక్కిన అద్భుత నిర్మాణాలు. ఇవి చరిత్ర, సంస్కృతి కలిసిన ప్రత్యేక గుహ నివాసాలు