పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి, హిందువుల ఆరాధ్యకేంద్రం. ప్రాచీన దేవాలయాలు, ఘాట్లు, ఆధ్యాత్మికత నిండిన వాతావరణం ఇక్కడ ఎటుచూసినా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇస్లాం మతంలో మక్కా అత్యంత పవిత్రమైన స్థలం. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది ముస్లింలు హజ్ యాత్ర కోసం ఇక్కడికి వస్తారు. కాబా ఆలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
ఇది క్రైస్తవ మతానికి గర్భగుడి లాంటిది. ఇక్కడి కాథలిక్ చర్చి, సెయింట్ పీటర్ బసిలికా, సిస్టైన్ చాపెల్ వంటి శిల్ప కళా నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం ఇది. ఇక్కడి మహాబోధి దేవాలయం మరియు బోధి వృక్షం. బౌద్ధులకి అత్యంత పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది.
శ్రీ షిర్డీ సాయిబాబా సమాధి పొందిన స్థలం. ఈ ప్రాంతం అన్ని మతాలకు విలువ ఇచ్చే ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. రోజూ వేలాది భక్తులు బాబా దర్శనానికి వస్తారు.
సిక్కు మతానికి చెందిన అత్యంత పవిత్ర స్థలం ఇది. పూర్తిగా బంగారంతో నిండి ఉన్న ఈ టెంపుల్ దాని చుట్టూ ప్రవహించే అమృత్ సరోవర్. నీటిలో అద్భుతంగా మెరుస్తుంది.
బౌద్ధమతానికి చెందిన ముఖ్య ఆరాధ్య కేంద్రమిది. ఈ ప్యాలెస్ దలైలామా యొక్క సింహాసనంగా పరిగణించబడుతుంది. ఇది టిబెట్ యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన గుర్తింపుకు ప్రతీక
హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతాలకు పవిత్ర నగరం. పాత పట్టణంలోని మతపరమైన నిర్మాణాలు మరియు ప్రాచీనత ప్రపంచవ్యాప్తంగా దీనిని పుణ్యక్షేత్రంగా చేస్తుంది.
హిందూ మరియు బౌద్ధ మతాల కలయికగా నిర్మించబడిన ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ సముదాయం. ఇది యునెస్కో వారసత్వ సంపదలో ఒకటి.
ప్రకృతి సౌందర్యం మధ్య శింటో మతానికి చెందిన ఆలయాలు మౌంట్ ఫుజిని శాంతంగా ఉంచుతాయి. ఇంకా ఇక్కడ అందం, భక్తి కలిసి ఉంటాయి.