లడఖ్

పచ్చని లోయలు, మంచుతో కప్పబడిన కొండలు, బైక్ రైడింగ్‌కి బెస్ట్ ప్లేస్ ఇది. వర్షాకాలంలో ప్రకృతి ప్రేమికులకు ఇది ఓ పరిపూర్ణ స్థలం.

స్పితి వ్యాలీ

నిశ్శబ్దమైన పర్వత ప్రాంతం, ఆలయాలు, చిన్న గ్రామాలతో  ఇది ప్రశాంతంగా ఉండేందుకు పర్ఫెక్ట్ ప్లేస్.

మన్నార్

టీ తోటలు, చిన్న చిన్న వర్షాలు, మంచుతో కప్పబడిన కొండలు. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం హనీమూన్ లేదా ఫ్యామిలీ ట్రిప్‌కు బెస్ట్.

కోర్గ్

కాఫీ తోటలు, కొండ ప్రాంతాలు, కదిలే మబ్బులు, జలపాతాలు, ఇలా ఒకటేమిటి ప్రకృతి ప్రేమికులకు పచ్చని వాతావరణం అందించే అందమైన స్థలం.  

మహాబలేశ్వర 

పచ్చని కొండలు, చల్లని వాతావరణం, హిల్‌‑వ్యూస్, ఫ్రూట్ గార్డెన్స్. వర్షాకాలంలో అస్సలు మిస్ అవకూడని ఏరియా.

గోవా  

వర్షాలతో తడిచిన బీచ్‌లు, నదీ క్రూజ్‌లు, తక్కువ క్రౌడ్. జూలైలో ప్రశాంతంగా ఈ గోవాని  ఎంజాయ్ చేయొచ్చు

డార్జీలింగ్ 

పచ్చటి టీఫిల్డ్‌లు, మంచుతో కప్పబడిన పర్వతాలు, టాయ్ ట్రైన్. వర్షాల్లో ఈ ప్రాంతం ఇంకాస్త అందంగా మారుతుంది.

మాల్షేజ్ ఘాట్ 

కొండ మార్గాలు, గాలి, మబ్బులతో కూడిన వాతావరణం. ట్రెక్కింగ్‌కి, నేచర్ ఫొటోగ్రఫీకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. 

చిరపుంజి 

భారీ వర్షాలు, జలపాతాలు, సహజ బ్రిడ్జ్‌లు. వానల మధ్య ప్రకృతిని ఆస్వాదించాలనుకొనే వారికి ఇది బెస్ట్ ప్లేస్.

ఒర్చ్హా 

చారిత్రాత్మక కోటలు, నదీ ప్రదేశాలు, ప్రశాంతమైన వాతావరణం. హిస్టరీ లవర్స్‌కి ఇదో స్పెషల్ లొకేషన్.