నీటిలో జీవించే ఈ జీవి పసిపిల్ల లాంటి తలతో, చిరునవ్వుతో కనిపిస్తుంది. ఇది తన అవయవాలను తిరిగి పెంచుకునే ప్రత్యేక శక్తిని కూడా కలిగి ఉంటుంది.
స్టార్-నోస్డ్ మోల్
దీని ముక్కు నక్షత్రాకారంలో ఉండి, 22 సెన్సిటివ్ ఫిలర్స్‌తో కూడి ఉంటుంది. ఇవి నేలలో నివసిస్తాయి అందంగా ఉంటాయి
మాంటిస్ ష్రిమ్ప్
ఈ జలచరం దాని కళ్ళతో ఒకేసారి ఎనిమిది నుండి పన్నెండు రంగులుచూడగలదు. ఇది తన పంజాలతో వేగంగా కొడుతూ ఎదుటివారిని దెబ్బతీస్తుంది.
సైగా యాంటెలోప్
దీని ముక్కు పెద్దగా ఉండి, వింత ఆకారంలో ఉంటుంది. ఇది ఎక్కువగా మధ్య ఆసియా ప్రాంతాలలో కనిపిస్తుంది, వాతావరణ మార్పులకు తట్టుకునే శక్తి దీనికి ఉంది.
నార్వాల్
ఆర్కిటిక్‌కు చెందిన ఈ చేప దాని పొడవాటి దంతాన్ని వాతావరణంలోని మార్పులను, నీటి ఉష్ణోగ్రతలో తేడాలను, సమీపంలోని ఆహారం ఉనికిని తెలుసుకోవటానికి ఒక సాధనంగా ఉపయోగిస్తుంది.
పింక్ ఫెయిరీ ఆర్మడిలో
ఈ చిన్న పింక్ కలర్ జీవి మట్టిలో బావుల్లా తవ్వుతుంది. ఇది దాని వెనుక భాగాన్ని కవచంలా వాడుతూ, నేలలో దాక్కుంటుంది.
ఫ్రిల్ నెక్ లిజర్డ్
ఈ లిజర్డ్ తన మెడ చుట్టూ ఉండే ఫ్రిల్ లాంటి చర్మాన్ని విప్పి దాడి సమయంలో శత్రువులను భయపెడుతుంది. ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది.
అయే-అయే
ఈ మడగాస్కర్ జంతువు సైజులో చిన్నదైనా, పెద్ద కళ్ళు మరియు పొడవాటి వ్రేళ్ళతో వింతగా కనిపిస్తుంది. ఇది చెట్లపై జీవిస్తూ కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది.
బ్లాబ్‌ఫిష్
దీని శరీరం నీటిలో ఉన్నప్పుడు ద్రవంలా ఉండి, భూమిపైకి వచ్చినప్పుడు జెల్లీలా మారుతుంది. ఇది ప్రపంచంలో అతి వికారమైన జంతువుగా ప్రసిద్ధి చెందింది.
లీఫీ సీ డ్రాగన్
ఈ సీ డ్రాగన్ ఆకులాంటి రెక్కలు మరియు సన్నని శరీరంతో సముద్రపు పాచి మధ్య దాగి ఉంటుంది. ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది.