ఆక్సోలోటిల్

ఇది ఎలుకలాంటి ముఖం కలిగి ఉండే ఒక రకమైన సాలమండర్. ఇది కోల్పోయిన తన శరీర భాగాలను తిరిగి పొందగలదు.  మెక్సికో లోతైన జలాల్లో కనిపిస్తుంది.

గలపాగోస్ ఫ్రిల్ల్డ్ షార్క్

మొసలి లాంటి తల ఉన్న ఈ షార్క్, పురాతన జాతికి చెందినది. 80 ముక్కల్లాంటి పళ్లతో చూడటానికి చాలా వికారంగా కనిపిస్తుంది.

పింక్ హ్యాండ్‌ఫిష్ 

ఈ చేప చేతులాంటి తన పాదాలతో నడుస్తుంది. ఈ యునిక్ ఫిష్ టాస్మానియా సముద్ర గర్భంలో మాత్రమే కనిపిస్తుంది. 

గోబ్లిన్ షార్క్

చూడటానికి ఇది భూతంలా కనిపించే షార్క్. పొడవాటి ముక్కుతో, మోటుగా ఉండే తలతో చాలా భయంకరంగా కనిపిస్తుంది.

డంబో ఆక్టోపస్

చిన్న చిన్న చెవుల్లా ఉండే ఫిన్లతో ఈ ఆక్టోపస్ డిజ్నీ క్యారెక్టర్‌లా ఉంటుంది. 13,000 అడుగుల లోతులో ఇది కనిపిస్తుంది.

ఫాంగ్‌టూత్ ఫిష్ 

పెద్ద పళ్లతో ఉండే ఈ చేప చీకటి లోతుల్లో జీవిస్తుంది. ఈ ఫిష్ రూపం వింతగా ఉండి చూపురులని భయపెడుతుంది. 

బార్రెల్ ఐ ఫిష్  

ఇది పారదర్శక తల కలిగిన చేప. దీని మెదడు బయటకి  కనిపిస్తుంది. కళ్ళు పైకి చూస్తూ ఉంటాయి.

హాట్చెట్ ఫిష్

ఈ వింతైన చేపకి దాని కడుపు నుండి వెలుగులు చిమ్ముతుంది. ఇది 5,000 అడుగుల లోతులో జీవిస్తుంది.

వాంపైర్ స్క్విడ్

ఇది స్క్విడ్ కానీ స్కిన్ రక్తం రంగులో ఉంటుంది. ఈ జీవి చీకటి లోతుల్లో జీవిస్తుంది. తన శరీరం వెలుగునిస్తుంది.

స్కేలీ ఫుట్ స్నైల్ 

ఇది మెటల్ షెల్ తో ఉండే స్నైల్. దీని తలపై ఖడ్గంలా ఉండే ఉపరితలం ఉంటుంది. అగ్నిపర్వతాల దగ్గర ఇది జీవిస్తుంది.