చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ భూమి భ్రమణంపై ప్రభావం చూపిస్తుంది. దీంతో గతంతో పోలిస్తే ఎర్త్ స్పిన్నింగ్ రేట్ తగ్గింది. 

ఈ డ్యామ్‌లో నిల్వయ్యే విపరీతమైన నీటి బరువు భూమి ద్రవ్యరాశిని కొద్దిగా మార్చి, రోజుని అతి స్వల్పంగా పెంచుతుంది అని శాస్త్రవేత్తలు వివరించారు.

నాసా జేపీఎల్ లెక్కల ప్రకారం, ఈ ప్రభావం రోజును కేవలం 0.06 మైక్రోసెకన్లు మాత్రమే పెంచుతుంది. అయితే ఇది  మనకు అసలు గుర్తించలేనంత చిన్న మార్పు .

డ్యామ్ భూమి గుండ్రత్వాన్నీ, ధ్రువస్థానాన్నీ చాలా స్వల్పంగా ప్రభావితం చేయవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు, కానీ మన రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం ఉండదు. 

ఫిజికల్ థియరీ ప్రకారం చూస్తే, వాటర్ స్టోరేజ్ భారీ మొత్తంలో ఒకేచోట ఉండటం వల్ల భూమిపై బరువు పెరిగి ఒకవైపుకు సింక్ అవుతుంది. దీంతో రోజు సమయం పెరుగుతుంది. 

ఎర్త్ రొటేషన్ ని స్లో డౌన్ చేసే ప్రధాన శక్తి మూన్ గ్రావిటీ. డ్యామ్‌ల ప్రభావం దానితో పోలిస్తే అతి స్వల్పమని స్టడీస్ నిరూపిస్తున్నాయి. .

2004 సుమత్రా భూకంపం కూడా భూమి భ్రమణాన్ని మార్చిందని నాసా తెలిపింది; అంటే ద్రవ్యరాశి కదలికలు గ్రహంపై చిన్న ప్రభావాలు చూపగలవు అనే విషయం ఇక్కడ ముఖ్యం 

అందుకే ఈ డ్యామ్ ప్రభావం సైంటిఫిక్ గా క్యూరియాసిటీని పెంచినప్పటికీ, భూమి ఆగిపోతుంది లేదా సమయం మారిపోతుంది అనడం అతిశయోక్తి మాత్రమే.

ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులలో ఒకటైన ఈ త్రీ గోర్జెస్ డ్యామ్, మానవ నిర్మాణాలు కూడా గ్రహ స్థాయిలో కొలవదగిన మార్పులు తేవచ్చని చూపింది.

మొత్తానికి హెడ్ లైన్ భయపెట్టేలా ఉన్నా, అసలు నిజం ఏమిటంటే ఇది భూమి స్పిన్‌ను సూక్ష్మంగా మాత్రమే తగ్గించే వీలుంటుంది. అని గుర్తుంచుకోవాలి అందరం ఇప్పుడు