చిత్రగుప్తుడు హిందూ పురాణాల్లో యమధర్మరాజుకు సహాయకుడిగా ఉంటాడు. భూమిపై ప్రతి మనిషి చేసిన పాప పుణ్యాలనుతన చిట్టాలో రాసి ఉంచుతాడని  నమ్మకం. 

చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని మనసునుండి జన్మించాడని పురాణాలు చెబుతాయి. అందుకే అతనిని దివ్య జ్ఞానం కలిగిన దేవునిగా భావిస్తారు. 

మనిషి తన జీవితం మొత్తంలో చేసిన మంచి చెడు పనులన్నింటినీ చిత్రగుప్తుడు లెక్కబెడతాడని అంటారు. మరణానంతరం ఆ లెక్కల ఆధారంగా తీర్పు ఉంటుందని చెబుతారు 

యమలోకంలో ధర్మ తీర్పు సమయంలో చిత్రగుప్తుడి పాత్ర చాలా ముఖ్యమని భావిస్తారు. అతని రికార్డుల ఆధారంగా పాప పుణ్య ఫలితాలు నిర్ణయిస్తారని నమ్మకం. 

ఈయన రాసే పుస్తకాన్ని 'అగ్రసంధాని' అంటారు, ఇందులో ప్రతి జీవి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసే పనులు పొందుపరచబడి ఉంటాయి. 

ఉత్తర భారతదేశంలో చిత్రగుప్తుడిని ప్రత్యేకంగా ఆరాధించే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా కాయస్థులు ఆయనను తమ ఆరాధ్య దేవుడిగా భక్తితో పూజిస్తారు.

చిత్రగుప్తుడు మనిషి ప్రతి చర్యను గమనిస్తాడనే భావన ధర్మబద్ధ జీవితం నేర్పుతుంది. మంచి పనులు చేయాలని, చెడు దూరంగా ఉంచాలని సూచిస్తుంది.