ఉలాన్ బటార్, మంగోలియా

ప్రపంచంలోనే అత్యంత చల్లటి రాజధాని. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉష్ణోగ్రతలు -40°C కు పడిపోతాయి. హిమశీతల ప్రదేశాలని ఇష్టపడే వారికి ఇది ఒక అద్భుత గమ్యం.

అస్తానా, కజఖస్తాన్

ఈ నగరం మైనస్ 30°C వరకూ చల్లబడుతుంది. కఠినమైన చలికి ప్రసిద్ధి. ఇటు ఆధునికత, అటు మంచు అందాలు కలబోతగా ఉంటాయిక్కడ.

మాస్కో, రష్యా

మాస్కో శీతాకాలంలో మంచుతో కప్పబడుతుంది. -25°C వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. చలిగాలులు, మంచు కవరింగ్‌తో ఈ నగరం అందంగా ముస్తాబవుతుంది. 

హెల్సింకి, ఫిన్లాండ్

ఇక్కడ శీతాకాలం గడ్డకట్టేంత చల్లగా ఉంటుంది. డిసెంబర్ నుండి మార్చి వరకు మంచు కురుస్తుంది. ప్రజలు తక్కువ వెలుతురు, ఎక్కువ మంచుకు అలవాటు పడిపోయారు 

ఓటావా, కెనడా 

కెనడా రాజధానిగా ఓటావా మైనస్ ఉష్ణోగ్రతలకు ప్రసిద్ధి. జనం మంచులో స్కేటింగ్, స్నోఫాలింగ్‌కి ఆసక్తి చూపుతారు. శీతాకాలపు స్పూర్తిదాయక దృశ్యాలు ఇక్కడ అనేకం కనిపిస్తాయి.

రేక్యావిక్, ఐస్లాండ్ 

ఇది ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉంటుంది. చల్లగా ఉండే ఈ నగరంలో నార్తన్ లైట్స్ కనిపించడం ప్రత్యేకత. శీతాకాలంలో ప్రయాణికులకు ఇది ఓ స్వర్గధామం. 

వాషింగ్టన్ DC, USA

అత్యంత చల్లగా కాకపోయినా, డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు మంచు కురుస్తుంది. మైనస్ ఉష్ణోగ్రతలు ప్రజలను ఇంట్లోనే ఉంచుతాయి. శీతాకాలంలో అందం మరింత పెరుగుతుంది.

బెర్న్, స్విట్జర్లాండ్

ఆల్ప్స్ పర్వతాల మధ్యలో ఉన్న ఈ నగరం చల్లదనానికి ప్రసిద్ధి. మంచుతో నిండిపోయిన వీధులు, శ్వేత హిమాలయాలు వలె కనిపిస్తాయి. స్విస్ సౌందర్యానికి ఇది ప్రతీక.