నాసా హబుల్ గమనించిన 41P అనే చిన్న తోకచుక్క  ముందుగా తన భ్రమణ వేగాన్ని తగ్గించుకుని, తర్వాత పూర్తిగా దిశ మార్చుకుని, రివర్స్ తిరిగి, అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇది శాస్త్రవేత్తలు మొదటిసారి చూసిన అరుదైన ఘటనగా రికార్డుకెక్కింది. ఎందుకంటే ఒక కమెట్ స్పిన్ పూర్తిగా రివర్స్ కావడం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. అందుకే ఇది  ప్రత్యేకం.

సూర్యునికి దగ్గరగా రాగానే మంచు ఆవిరై గ్యాస్ జెట్లు బయటకు దూసుకొచ్చాయి; అవే చిన్న థ్రస్టర్లలా పని చేసి భ్రమణాన్ని దాని తిరుగు దిశను కూడా ప్రభావితం చేశాయి.

మార్చి 2017లో ఈ తోకచుక్క సుమారు 24 గంటలకు ఒకసారి తిరిగేది, కానీ మే నాటికి ఆ స్పిన్ 46 నుంచి 60 గంటలకు మందగించింది.

తర్వాత హబుల్ డేటాలో ఈ స్పిన్ మళ్లీ వేగంగా మారింది; డిసెంబరు 2017లో దాని రొటేషన్ పిరియడ్ సుమారు 14 గంటలుగా నమోదైంది అక్కడే శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అది దాదాపు ఆగిపోయి, ఆ తర్వాత ఉపరితల గ్యాస్ జెట్ల ప్రభావంతో రివర్స్ దిశలో తిరగడం ప్రారంభించింది.

41P/Tuttle-Giacobini-Kresák అనే ఈ తోకచుక్కజూపిటర్ ఫ్యామిలీకి చెందినది; ఇది సూర్యుని చుట్టూ సుమారు 5.4 సంవత్సరాలకు ఒకసారి ప్రదక్షిణ చేస్తుంది.

ఈ తోకచుక్క గుండ్రని భాగం సుమారు ఒక కిలోమీటరు పరిమాణంలోనే ఉండటంతో, చిన్న గ్యాస్ జెట్లు కూడా దాని స్పిన్‌పై బలంగా పనిచేశాయి అని తేలింది.

ఇలాంటి స్పిన్ మార్పులు తోకచుక్క అంతర్గత నిర్మాణం, ఉపరితల బలహీనతలు, సూర్య వేడి ప్రభావం గురించి కొత్త సంకేతాలు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

నిరంతరం ఇలాగే గ్యాస్ జెట్లు ఒత్తిడి పెడితే, భవిష్యత్తులో ఈ చిన్న తోకచుక్క అస్థిరమై పగిలిపోయే అవకాశముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు