మాండరిన్ డక్ 

రంగు రంగుల అల్లికలతో మాండరిన్ డక్ చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దీని శరీరంపై ఉండే బ్రౌన్, బ్లూ, అండ్ ఆరంజ్ కలర్స్ తో ఎంతో కళాత్మకంగా ఉంటుంది. 

స్నో లేపర్డ్  

మంచు పర్వతాలలో నివసించే ఈ లేపర్డ్ తెల్లని శరీరంపై నల్లని మచ్చలతో కూడిన గొప్ప రూపం. అందుకే ఇది చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

మ్యాండ్రిల్ 

దీని కలర్ ఫుల్ ఫేస్ నేచర్ గీసిన ఆర్ట్ లా ఉంటుంది. ఈ బ్యాబూన్ ఫేస్ పై ఉండే బ్లూ అండ్ రెడ్ కలర్స్ ముఖానికి అందాన్నిస్తాయి.

అక్స్‌యలాటిల్  

ఈ సీ క్రియేచర్ పింక్ కలర్ బాడీ కలిగి, చిరునవ్వుతో కనిపించే ముఖంతో అందరినీ ఆకర్షిస్తుంది. చూడటానికి ఇది రెడ్‌లైట్‌ ఫిష్‌లా కనిపిస్తుంది.

పీకాక్ స్పైడర్  

చిన్నదైనా, దీని రంగు రంగుల కాళ్ళతో, నడిచేటప్పుడు చూపే శైలి అద్భుతం. అచ్చం ఇది పీకాక్ అంత అందంగా ఉంటుంది.

ఫ్రిల్డ్ లిజార్డ్

ఈ లిజార్డ్ మెడ చుట్టూ ఉన్న పెద్ద ఫ్రిల్‌ లాంటి చర్మంతో బలమైన రూపాన్ని ఇస్తుంది. తన రూపంతో ఇది ప్రత్యర్థులను భయపెడుతుంది.

బ్లూ డ్రాగన్

సముద్రపు లోతుల్లో కనిపించే ఈ జీవి బ్లూ, అండ్ సిల్వర్ కలర్స్ తో ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇది నిజమైన వాటర్ మాన్స్ టర్ లా ఉంటుంది.

రెడ్ లిప్‌డ్ బ్యాట్ ఫిష్ 

దీని మందపాటి ఎర్రటి పెదాలు మరియు విడ్డూర ఆకారం వలన ఇది విభిన్నంగా కనిపిస్తుంది. ఇది బ్యూటిఫుల్ అండ్ యూనిక్ సీ యానిమల్.

సాటినీ బౌవర్బర్డ్ 

ఈ పక్షి గ్రేడియంట్ బ్లూ కలర్ లో మెరిసిపోతుంది. ఇది తన గూటిని అందంగా అలంకరించటం ద్వారా ప్రసిద్ధి చెందింది.

లీఫ్-టైల్డ్ గెక్కో  

ఈ గెక్కో ఆకులా తన తోకను మారుస్తుంది. శత్రువులకి దొరకకుండా దాచుకునే నైపుణ్యం మరియు రూపం దీని ప్రత్యేకత.