పిరమిడ్లు, ఫారో రాజులు, నైల్ నది పరిసర నాగరికతలు మానవ చరిత్రను రూపుదిద్దిన ఈజిప్ట్ ప్రాచీనతకు ప్రతీక. ఇది వేల ఏళ్ల చరిత్రను నిలుపుకుంది.
భారతదేశం
వేదాలు, సంస్కృతి, సింధు లోయ నాగరికత, గుప్తులు, మౌర్యులు వంటి మహా సామ్రాజ్యాల మూలం భారతదేశం. ప్రపంచంలోనే అత్యంత సంస్కృతిగల దేశం ఇదే!
చైనా
షాంగ్, జౌ, హాన్ రాజవంశాలతో పాటు, కాగితం, తూకాలు కనిపెట్టిన చైనా పురాతన విజ్ఞానానికి నిలయం. ఇక్కడ దశలవారీగా నాగరికత అభివృద్ధి చెందింది.
ఇరాక్
టైగ్రిస్, యుఫ్రటిస్ నదుల మధ్య అభివృద్ధి చెందిన మెసోపొటేమియా నాగరికత – శాస్త్ర విజ్ఞానం, లిఖిత పద్ధతులకి పుట్టినిల్లు.
గ్రీస్
ఫిలాసఫీ, డెమోక్రసీ, ఒలింపిక్స్ కి జన్మస్థానమైన గ్రీస్ యూరప్‌లోని ప్రాచీన నాగరికతలలో అగ్రగామి. సోక్రటీస్, అరిస్టాటిల్ వంటి ఫేమస్ ఫిలాసఫర్స్ కలిగిన దేశం.
ఇటలీ
రోమన్ సామ్రాజ్యం ప్రభావం ప్రపంచ పాలన, చట్టవ్యవస్థలపై ఉందని చరిత్రలో స్పష్టంగా కనిపిస్తుంది. కొలీసియం, సిసర్ పాలన గుర్తుండిపోతాయి.
ఇరాన్
అచ్చం సంస్కృతి, జరథుష్ట్ర ధర్మం, అఖెమెనిడ్ సామ్రాజ్యం వంటి గొప్ప ఘట్టాల మూలంగా పర్సియా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
ఇజ్రాయెల్
యూదు మతం, బైబిల్ చరిత్ర, జెరూసలేం నగరం వంటి మతపరమైన విశ్వాసాలతో ఇజ్రాయెల్ చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేశం.
టర్కీ
హిట్టైట్ రాజవంశం నుండి ఒట్టోమన్ సామ్రాజ్యానికి మధ్య టర్కీ భూభాగం ఎన్నో నాగరికతల ఉత్పత్తికే కేంద్రం. ట్రోయ్ యుద్ధం అక్కడే జరిగింది.