ఫైర్‌బాల్స్ అంటే భూ వాతావరణంలోకి దూసుకొచ్చే చిన్న చిన్న అంతరిక్ష రాళ్లు లేదా ప్రకాశవంతమైన ఉల్కలకు వాడే ఖగోళ శాస్త్ర పదాలు.

ఇవి సాధారణ ఉల్కలకంటే చాలా ప్రకాశంగా కనిపిస్తాయి కాబట్టి రాత్రి ఆకాశంలో అద్భుత ఒక దృశ్యంలా అనిపిస్తాయి.

భూ వాతావరణంలోకి ప్రతి రోజూ వేలాది చిన్న చిన్న కణాలు ప్రవేశిస్తాయి కానీ వాటిలో చాలావరకు మనకు కనిపించవు.

భూ వాతావరణంలోకి ప్రతి రోజూ వేలాది చిన్న చిన్న కణాలు ప్రవేశిస్తాయి కానీ వాటిలో చాలావరకు మనకు కనిపించవు.

పెద్ద పరిమాణంలో ఉన్న కణాలు వాతావరణ ఘర్షణతో మండిపడి ప్రకాశవంతమైన ఫైర్‌బాల్స్‌గా మారి మనకి కనిపిస్తాయి.

కొన్ని ఫైర్‌బాల్స్ కేవలం క్షణాల్లో కరిగిపోతాయి, మరికొన్ని శబ్దం చేస్తూ ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్తాయి. 

అవి కనిపించే సమయం చాలా చిన్నదే అయినా వాటి వెలుగు మాత్రం చంద్రుడి కాంతికన్నా కూడా చాలా బలంగా ఉంటుంది.

ఫైర్‌బాల్స్ సంవత్సరం మొత్తం ఎప్పుడినా కనిపిస్తాయి. కానీ ఉల్కలు మాత్రం వర్షాల సమయంలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ఈ ఫైర్‌బాల్స్ లో చాలా వరకు భూమిని చేరకముందే పేలిపోతుంటాయి. వీటివలన పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. వీటినే బోలైడ్‌లు అని పిలుస్తారు,

అయితే చాలా అరుదుగా పెద్ద పెద్ద ఫైర్‌బాల్స్ నేలపై పడుతుంటాయి. అలాంటి వాటినే ఉల్కలు లేదా తోకచుక్కలు అని పిలుస్తారు.