చైనా నేతృత్వంలోని ఐన్‌స్టీన్ ప్రోబ్ టెలిస్కోప్ ఆకాశంలో అసాధారణమైన శక్తివంతమైన X-re ఫ్లాష్ ను గుర్తించింది.
ఈ కొత్త సంఘటనకు సైంటిస్టులు
EP241113a
అని పేరు పెట్టారు; ఇది సాధారణ గామా-రే బరస్ట్ లా అస్సలు కనిపించలేదు.
సాధారణంగా భారీ నక్షత్రం కూలిపోతే అత్యంత వేగంగా పేలే రిలేటివిస్టిక్ ఫైర్ బాల్ ఏర్పడి గామారేస్ రిలీజ్ అవుతాయి.
కానీ ఈసారి ఎక్స్ ప్లోజన్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉన్నా, రేడియేషన్ పీక్ మాత్రం తక్కువ ఎనర్జీ సాఫ్ట్ ఎక్స్-రేస్ వైపు కనిపించింది.
అందుకే రీసర్చర్స్ ఇది ఎన్నో ఏళ్ళుగా సిద్ధాంతంగా మాత్రమే ఉన్న “డర్టీ ఫైర్ బాల్” కావచ్చని భావిస్తున్నారు.
“డర్టీ ఫైర్ బాల్” అంటే ఎక్స్ ప్లోజన్ జెట్‌లో ఎక్కువ పదార్థం కలవడం వల్ల అది సాధారణ GRB కంటే నెమ్మదిగా విస్తరించడం.
అధ్యయనం ప్రకారం ఈ జెట్ స్పీడ్ సాధారణ గామా-రే బరస్ట్ లకన్నా తక్కువగా, లోరెంజ్ ఫ్యాక్టర్ ~20 స్థాయిలో ఉంది.
దీని వేగం తక్కువగా కనిపించినా, విడుదలైన శక్తి మాత్రం చాలా భారీగా ఉండి, దీంతో ఇది సాధారణ పేలుడు కాదని స్పష్టంగా నిరూపించింది.
ఈ డిస్కవరీ భారీ నక్షత్రాల మరణం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఇంకా ఎన్నో దాగిన పేలుడు రకాలు ఉండొచ్చని సూచిస్తోంది.
ఈ అబ్జర్వేషన్ సరైందిగా నిర్ధారితమైతే, నక్షత్రాల అంతిమ దశలు మరియు గామా-రే బరస్ట్ ల గురించి శాస్త్రవేత్తల అవగాహన మారొచ్చు.