అంటార్కిటికా మంచు తుఫాన్ల మధ్య ఎంపరర్ పెంగ్విన్ తన గుడ్డును కాళ్లపై ఉంచి, చలిని తట్టుకుంటూ గంటల తరబడి కదలకుండా నిలబడుతుంది.

మైనస్ ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నప్పటికీ గాలి వేగం పెరిగినప్పటికీ గుడ్డు మాత్రం నేలపై పడకుండా నిరంతరం తన శరీరంతో కప్పి ఉంచి జాగ్రత్తగా కాపాడుతుంది.

ఫిమేల్ పెంగ్విన్ సముద్రంలో ఆహారం కోసం దూరం ప్రయాణిస్తే మేల్ పెంగ్విన్ నెలల పాటు ఉపవాసంగా నిలబడి గుడ్డును కాచుకుంటుంది. 

తీవ్రమైన చలిలో తన శరీర వేడిని గుడ్డుకు అందిస్తూ జీవం నిలబెట్టేందుకు పెంగ్విన్ పేరెంట్స్ ప్రకృతిలో అసాధారణ సహనంతో పోరాడుతారు. 

ఆకలి బాధ పెరిగినా మంచు తుఫాన్లు దాడి చేసినా తమ పిల్ల సురక్షితంగా పుట్టాలని ఎంతో ఆశతో స్థిరంగా నిలబడతారు.

కొన్నిసార్లు ఆహారం లేక శక్తి తగ్గిపోవడంతో కొన్ని పెంగ్విన్లు ప్రాణాలు కోల్పోతాయి కానీ గుడ్డును మాత్రం చివరి శ్వాసవరకు విడిచిపెట్టవు.

ప్రకృతిలో నిజమైన త్యాగం ఎలా ఉంటుందో చూపించే ఉదాహరణగా ఎమ్పెరర్ పెంగ్విన్ తల్లిదండ్రుల ప్రేమ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది ఎప్పటికీ.