ఫ్రాన్స్‌లోని షోవే గుహలో కనిపించిన యానిమల్స్ ఆర్ట్  సుమారు 36,000 ఏళ్ల నాటివి, అందుకే ఇవి మానవ చరిత్రలోనే మొట్టమొదటి విజువల్ స్టోరీ టెల్లింగ్ గా భావిస్తున్నారు. 

కొన్ని యానిమల్స్ కి ఎక్స్ట్రా కాళ్లు, తలల రేఖలు గీసిన తీరు చూస్తే వాటి కదలికను చూపించాలనే ప్రయత్నంలా కనిపిస్తుంది, అందుకే వాటిని ఏన్షియంట్ యానిమేషన్‌ ఇమేజెస్ గా పరిశోధకులు చెప్తున్నారు.

గుహల్లో దీపాల మసక వెలుగు కదిలేటప్పుడు ఈ ఆర్ట్ పై నీడలు మారుతూ, జంతువులు నిజంగా పరుగెత్తుతున్నట్లే కనిపించి ఉండొచ్చని స్టడీస్ చెప్తున్నాయి.

ఇది నిజంగా మూవీ కాదు; కానీ మూమెంట్, ప్యాటర్న్, ఆప్టికల్ ఇల్యూజన్  లతో స్టోరీ చెప్పే ప్రయత్నం కావడంతో 'మొట్టమొదటి సినిమా' అనే పోలిక చాలామందిలో వచ్చింది  

షోవే కేవ్ ఆర్ట్ లో సింహాలు, గేదెలు, గుర్రాలు, ఖడ్గమృగాలు వంటి జంతువులు ఎక్కువగా కనిపిస్తాయి, అవే ఈ ఏన్షియంట్ ఆర్ట్ లో మెయిన్ క్యారెక్టర్స్ అని తెలుస్తుంది. 

చిత్రాల ఆకృతి, గోడల వంకర్లు, జంతువుల స్థానాలు చూస్తే కళాకారులు గుహ ఉపరితలాన్ని జాగ్రత్తగా ఉపయోగించి లోతు, కదలిక, డ్రామా కలిపారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఒక్కో ఆర్ట్ మాత్రమే కాదు, వరుసగా ఉన్న బొమ్మలను కలిపి చూస్తే వేట, కదలిక, ఉద్రిక్తత ఉన్న చిన్న కథలా అనిపిస్తుంది.

40,000 ఏళ్ళు అన్న మాట సుమారు అంచనా మాత్రమే. పాపులర్ షోవే కేవ్ ఆర్ట్ సాధారణంగా 36,000 ఏళ్ల కాల నిర్ధారణే ఎక్కువగా చెబుతారు. 

సినిమా పుట్టుక కెమెరాతో ప్రారంభమైనా, కదిలే దృశ్యాన్ని ఊహించి చూపాలనే మనిషి కోరిక మాత్రం కేవ్ ఆర్ట్ కాలానికే చెందుతుంది.

అందుకే ఈ కేవ్ ఆర్ట్స్ ని చూసినప్పుడు, మన పూర్వీకులు గోడలపై రంగులు మాత్రమే కాదు, కదిలే కల్పనను కూడా సృష్టించారని అర్థమవుతుంది.