ఫ్యూచర్ లో 1 ట్రిలియన్ డాలర్ల కంపెనీని కేవలం ఐదుగురు ఎంప్లాయిస్ తో నడపగలరని సింగ్యులారిటీ యూనివర్సిటీ ఫౌండర్ సలీమ్ ఇస్మాయిల్ ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో తాజాగా చెప్పారు.

ఆయన మాటల ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటలిజంట్, ఆటోమేషన్, ఓపెన్ సోర్స్ టెక్నాలజీలు చిన్న టీమ్స్ కేలార్జ్ స్కేల్ బిజీనెస్ పవర్ ని అందిస్తున్నాయి, 

ఒకప్పుడు బిలియన్ డాలర్ల కంపెనీ నిర్మించాలంటే లక్షమంది ఉద్యోగులు అవసరమయ్యేవారని, తర్వాత అది పదివేలకు తగ్గిందని ఆయన వివరించారు, టెక్నాలజీ పెరుగుతుండగా ఈ సంఖ్య ఇంకా పడిపోయింది. 

గూగుల్ సుమారు వెయ్యి మంది ఉద్యోగులతో ఆ మైలురాయిని చేరగా, ఓపెన్‌ఏఐ కొన్ని వందల మందితోనే భారీ ప్రభావం చూపిందన్నారు, అని సలీమ్ ఉదాహరణగా చెప్పారు.  

ఇకపై కంపెనీలలో అనేక పనులు ఏఐ సిస్టమ్‌ల మధ్యే నేరుగా జరిగి, మనుషుల పాత్ర మానిటరింగ్, మేనేజ్మెంట్ కే పరిమితమవుతుందని ఆయన వివరించారు.

పెద్ద సంస్థలు తమ పాత విధానాల వల్ల న్యూ ఇన్వెన్షన్స్ ని  అడ్డుకుంటాయని, సంస్థలలోనే ఒక రకమైన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుందన్నారు. 

అందుకే కలవరపెట్టే ఆలోచనలు పెద్ద కార్పొరేట్ల నుంచి కాదు, చురుకైన చిన్న స్టార్టప్‌ల నుంచి వేగంగా బయటకు వస్తాయని సలీమ్ అన్నారు, ఇదే రేపటి బిజినెస్ గేమ్‌చేంజర్.  

ఏఐ, సెన్సర్లు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ చవకబారడం వల్ల వ్యక్తులు కూడా గతంలో కార్పొరేట్లకే సాధ్యమైన టెక్నాలజీని ఇప్పుడు రూపొందించగలుతున్నారు, చిన్న జట్లు కూడా ప్రపంచస్థాయి పోటీదారులే.

ఫ్యూచర్ లో మోస్ట్ డేంజరస్ అపోనెంట్ మీకు తెలియని చిన్న స్టార్టప్ కావచ్చని, ఇన్నోవేషన్ ఎక్కడినుంచైనా ఒక్కసారిగా పేలిపోవచ్చని ఆయన హెచ్చరించారు.

ఈ మాట కంపెనీస్ ఫ్యూచర్, జాబ్స్ నేచర్ , ఏఐ పవర్ కలిసి వ్యాపార ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతున్నాయనే స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తోందని తెలుస్తోంది.