ఢాకా – బాంగ్లాదేశ్

గంగా డెల్టాలో ఉన్న ఢాకా, ప్రతి మాన్సూన్ సీజన్లో భారీగా వరదలు ఎదుర్కొంటుంది. సరైన నిర్వహణ లేకపోవటమే దీనికి ప్రధాన కారణం.

జకార్తా – ఇండోనేషియా

జలమట్టానికి దిగువన ఉండే జకార్తా, భూగర్భజలాల వినియోగం వల్ల క్షీణించి వరదలకు ఎక్కవ గురవుతుంది. 

మనిలా – ఫిలిప్పీన్స్ 

టైఫూన్స్ ప్రభావంతో మాన్సూన్ సమయంలో మనిలాలో వరదలు తీవ్రమవుతాయి. డ్రైనేజ్ వ్యవస్థ బలహీనంగా ఉండటమే దీనికి మేజర్ ఇష్యూ. 

బ్యాంకాక్ – థాయిలాండ్ 

చావ్ ఫ్రాయా నది ఒడ్డున ఉన్న బ్యాంకాక్ వరదలతో తరచూ ఇబ్బందులు పడుతుంది. సముద్ర మట్టానికి దగ్గరగా ఉండడం వల్లనే ఈ సమస్య.

కంబే – కొంగో

భారీ వర్షాలు, మౌలిక సదుపాయాలు తక్కువగా ఉండటం  వల్ల కంబే నగరంలో వరదలు ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా మారతాయి.  

లాగోస్ – నైజీరియా

ఆఫ్రికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లాగోస్ వరదల సమస్యతో ప్రతీ మాన్సూన్‌కి నరకయాతన అనుభవిస్తుంది.

మోపుటో – మొజాంబిక్

మోపుటో నగరంలో మౌలిక సదుపాయాల లోపం మరియు తక్కువ ఎత్తులో ఉండటం వల్ల వరదలు తరచూ వస్తుంటాయి.

న్యూ ఢిల్లీ – భారతదేశం

యమునా నదికి పక్కన ఉండే ఢిల్లీ నగరం, భారీ వర్షాలు పడినపుడు వరదలతో ముంచెత్తుతుంది.