దేవుడి ముందు ఉంచిన పువ్వు ఆకస్మికంగా నేలపై పడిపోతే దాన్ని సాధారణంగా తీసుకోకండి, అది ఒక దైవ సంకేతంగా భావిస్తారు.
పూజ సమయంలో పువ్వు ఎడమ వైపు పడితే ఆ ఇంట్లో ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురు కావచ్చని పెద్దలు చెప్తుంటారు.
పువ్వు దేవుడి విగ్రహం వెనుక పడితే పూర్వీకుల ఆశీర్వాదం అవసరమని భావించి పితృ తర్పణం చేయాలని సూచిస్తారు
పూజ పూర్తయిన తర్వాత ఎండిన పువ్వు దానంతట అదే కింద పడితే ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సంకేతం.
పువ్వు నీటి పాత్రలో పడిపోతే ఇంట్లో శాంతికి భంగం కలగవచ్చని శాస్త్రాలు సూచిస్తున్నాయని కొందరు చెబుతారు.
లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచిన పువ్వు జారి పడితే ఖర్చులు పెరిగే సూచనగా భావించి ఆర్థిక నియంత్రణ అవసరం అంటారు.
పూజ గది వెలుపలికి పువ్వు చేరితే ఇంటి శుభశక్తి బయటకు వెళ్లుతోందని పెద్దలు హెచ్చరిస్తూ వెంటనే దీపం వెలిగించమంటారు.
పువ్వు తరచుగా పడిపోతుంటే పూజా స్థలాన్ని శుభ్రపరచి నిత్య దీపారాధన చేయాలని ఆధ్యాత్మికులు సూచిస్తున్నారు.
అయితే భయం కాకుండా భక్తితో దేవుడిని ప్రార్థించి మనసు ప్రశాంతంగా ఉంచడం ప్రతి సమస్యకు ఉత్తమ పరిష్కారం మరి మీరేమంటారు?