అనుకోని సమయంలో సహాయం లభించడం, సమస్యలు తేలికగా పరిష్కారం కావడం దేవుడు మీ వెంట ఉన్నాడని తెలిపే సంకేతాలు.
మనసులో ఎప్పుడూ తెలియని ప్రశాంతత ఉండటం, కష్టాల్లో కూడా భయం లేకపోవడం దైవ అనుగ్రహానికి స్పష్టమైన సూచనగా భావించాలి.
ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకోవడం, పెద్ద నష్టాలు చిన్నగా మారిపోవడం ఇలాంటివన్నీ దేవుని రక్షణ కవచం మీ చుట్టూ ఉన్నట్లు తెలిపే సూచన.
అనుకోకుండా సరైన వ్యక్తులు జీవితంలోకి రావడం, అవసరమైన సమయంలో సరైన సలహా లభించడం దైవ ప్రణాళికగా భావించవచ్చు.
మనం చేసిన మంచి పనులకు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితం రావడం జరిగితే దైవ కృప మీపై ఉందని తెలియజేస్తుంది.
తప్పు చేయబోతున్నప్పుడు లోపల నుంచి ఆగమని హెచ్చరిక వినిపించడం మనలోని దేవుడు మార్గనిర్దేశం చేస్తున్న సంకేతంగా భావించాలి.
నిరాశ సమయంలో అకస్మాత్తుగా ఆశ కలగడం, మనసుకు ధైర్యం రావడం ఇవన్నీ దైవ సాన్నిధ్యానికి గొప్ప చిహ్నంగా గుర్తించాలి.