న్యూజిలాండ్ సమీపంలోని కెర్మడెక్ దీవుల క్రింద రీసెంట్ గా శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన గోల్డ్ ప్రొడక్షన్ సిస్టంని గుర్తించారు, ఇది నేచురల్ గోల్డ్ ఫ్యాక్టరీలా పనిచేస్తుందని చెబుతున్నారు.
ఈ ప్రాంతం సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వత శ్రేణులతో నిండి ఉంది, ఇవి ఖనిజాలను వేడి చేసి బంగారం రూపంలో మారుస్తున్నాయి.
శాస్త్రవేత్తల ప్రకారం, హైడ్రోథర్మల్ వెంట్స్ ద్వారా వేడి నీరు ఖనిజాలను కరిగించి ఈ ప్రాంతంలో బంగారం సృష్టి ప్రక్రియను ప్రారంభిస్తోంది.
ఈ ప్రక్రియలో సల్ఫర్, కాపర్ వంటి మూలకాలు కూడా కలుస్తున్నాయి. దీంతో సముద్ర గర్భంలో గోల్డ్ పాటికల్స్ ఏర్పడుతున్నాయి.
ఈ గోల్డ్ ఫ్యాక్టరీ ప్రకృతి శక్తుల వల్ల ఏర్పడింది, ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న నేచురల్ కెమికల్ ప్రాసెస్ గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కెర్మడెక్ దీవులు పసిఫిక్ ఓషన్‌లో ఉన్న ప్రమాదకర ప్రాంతం, ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టం మరియు ప్రమాదకరం కూడా అని నిపుణులు చెప్తున్నారు.
ఈ గోల్డ్ డిపాజిట్లు సముద్ర గర్భంలో లోతుల్లో ఉన్నందున వాటిని వెలికితీయడం ప్రస్తుతం టెక్నికల్ గా చాలా క్లిష్టమైన పని అవుతోంది.
ఇలాంటి నేచురల్ గోల్డ్ ఫ్యాక్టరీలు భూమిపై అరుదుగా మాత్రమే కనిపిస్తాయి, అందుకే ఈ డిస్కవరీ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.
ఈ రీసర్చ్ భవిష్యత్తులో కొత్త మైనింగ్ టెక్నాలజీలకు మార్గం చూపవచ్చు, అయితే ఇది పర్యావరణంపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు ఉన్నాయి.
భూమి లోపల ఉన్న ఈ మిస్టీరియస్ గోల్డ్ ఫ్యాక్టరీ మన గ్రహంలో ఇంకా ఎన్నో తెలియని అద్భుతాలు ఉన్నాయని మనకు గుర్తు చేస్తుంది.