గూగుల్ Vids ఇప్పుడు న్యూ అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. సాధారణ గూగుల్ అకౌంట్ ఉన్నవారు కూడా AI వీడియోలు ఈజీగా తయారు చేసుకోవచ్చు. 

ఈ అప్‌డేట్‌లో Veo 3.1తో చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి హైక్వాలిటీ వీడియో క్లిప్స్ వెంటనే రూపొందించుకోవచ్చు కాబట్టి బిగినర్స్ కి ఇది చాలా ఉపయోగకరం అవుతుంది.

ఎక్కువ రిస్క్ లేకుండా టెంప్లేట్లు, ఇన్స్ట్రక్షన్స్, సీన్స్, మీడియా ఆప్షన్స్ అందించడంతో వీడియో మేకింగ్ ప్రాసెస్ కొత్త క్రియేటర్లకు కూడా మరింత సింపుల్ గా మారిందిప్పుడు. 

గూగుల్ ప్రకారం, పర్సనల్ అకౌంట్లకు ప్రతి నెల 10 ఫ్రీ  వీడియో జనరేషన్లు లభిస్తాయి కాబట్టి ఫస్ట్ ఎక్స్ పరిమెంట్స్ చేసేవారికి ఇదో మంచి అవకాశం.

Google Vids లో స్క్రీన్ రికార్డర్ ఫెసిలిటీ ఉండడంతో ట్యుటోరియల్స్ ప్రెజెంటేషన్స్ లేదా డెమో వీడియోలు మనమే నేరుగా రికార్డ్ చేసి వీడియోలో చాలా ఈజీగా యాడ్ చేయవచ్చు.

వీడియో రెడీ అయిన తర్వాత యూట్యూబ్‌కు నేరుగా పబ్లిష్ చేసే ఆప్షన్ ఉండటం వల్ల కంటెంట్ క్రియేటర్లకు అప్లోడ్ పని మరింత ఫాస్ట్ గా పూర్తవుతుంది.

Vids లో డాక్యుమెంట్ లేదా ఫైల్ ఆధారంగా అవుట్‌లైన్ సీన్లు సూచించే Gemini హెల్ప్ ఉండటంతో, కొత్త యూజర్లకు స్టోరీబోర్డ్ తయారీ సమయం గణనీయంగా తగ్గుతుంది.

అయితే AI జనరేట్ అయ్యే కొన్ని వీడియో క్లిప్స్ సాధారణంగా చిన్న నిడివితో వస్తాయి కాబట్టి ఫుల్ సినిమాటిక్ వీడియోలకు ఎక్స్ట్రా ఎడిటింగ్ ఇంకా అవసరమవుతుంది.

తెలుగు కంటెంట్ క్రియేటర్లు దీనిని స్క్రిప్ట్ విజువల్స్ డ్రాఫ్ట్ సీన్లు కోసం వాడి చివరగా తెలుగు వాయిస్‌ఓవర్ తో మరో ఎడిటర్‌లో ఫినిష్ చేయవచ్చు.

మొత్తానికి Google Vids కొత్త అప్‌డేట్ వీడియో క్రియేషన్‌ను ఈజీ చేసి ఫ్రీ స్టార్ట్ ఇచ్చినా ప్రొఫెషనల్ ఫైనల్ టచ్‌కు ఇంకా ఇతర టూల్స్ సహాయం అవసరం.