ఎలాన్ మస్క్ X లో త్వరలో “Grok Computer” వస్తుందని కన్ఫార్మ్ చేయడంతో, AI ప్రపంచంలో గేమ్ ఛేంజర్ వచ్చేస్తుంది.
Grok వెబ్ వెర్షన్ కోడ్‌లో “enable_grok_computer” అనే ఫీచర్ ఫ్లాగ్ కనిపించడంతో, ఇది కంప్యూటర్ కంట్రోల్ AI ఏజెంట్ కావచ్చనే ఊహాగానాలు పెరిగాయి.
ఈ సిస్టమ్ సాధారణ చాట్ బోట్ కాకుండా, కంప్యూటర్ స్క్రీన్‌ను చూసి పనులు చేసేందుకు రూపొందించిన ఏజెంట్ కావచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
అంటే గ్రోక్ ఫ్యూచర్ లో యాప్స్ ఓపెన్ చేయడం, క్లిక్స్ చేయడం, ఇన్ పుట్స్ ఇవ్వడం వంటి పనులను స్వయంగా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇది మస్క్ అనౌన్స్ చేసిన “Macrohard” లేదా digital worker తరహా AI ప్రాజెక్ట్‌కు ప్రివ్యూ అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
Tesla మరియు xAI కలిసి రియల్ టైమ్ స్క్రీన్ అండర్ స్టాండింగ్ కీ బోర్డ్-మౌస్ కంట్రోల్ వంటి సామర్థ్యాలపై పని చేస్తున్నట్లు ఇప్పటికే పలు రిపోర్టులు సూచించాయి.
గ్రోక్ కంప్యూటర్ రిలీజ్ అయితే AI కేవలం అన్సర్స్ ఇవ్వడం కాకుండా, మన ప్లేస్ లో కంప్యూటర్ టాస్క్స్ పూర్తి చేసే దిశగా మారుతుంది.
ఇప్పటివరకు ఆఫీషియల్ లాంచ్ డేట్, ప్రైజ్, సపోర్టెడ్ డివైజెస్ వంటి పూర్తి వివరాలు ఎలాన్ మస్క్ గానీ xAI గానీ ప్రకటించలేదు.
అయినప్పటికీ, కోడ్ క్లూస్ మరియు మస్క్ రెస్పాన్స్ కారణంగా గ్రోక్ కంప్యూటర్ త్వరలో ప్రకటించబడే అవకాశం ఉందని టెక్ సర్కిల్స్ లో భారీ చర్చ సాగుతోంది.
ఇది నిజంగా లాంచ్ అయితే, పర్సనల్ అసిస్టెంట్ స్థాయిని దాటి, కంప్యూటర్ ని నడిపే AI అసిస్టెంట్స్ యుగానికి గ్రోక్ నాంది కావచ్చు.