సాదారణంగా మనం హనుమంతుడిని అంజనాదేవి, కేసరిల ఏకైక సంతానంగా భావిస్తాం. కానీ బ్రహ్మాండ పురాణం ప్రకారం హనుమంతుడికి మరో ఐదుగురు సోదరులు కూడా ఉన్నారని చెప్పబడింది. 

ఆ స్టోరీ ప్రకారం హనుమంతుడు అందరిలో పెద్దవాడు, మిగతా సోదరులు వేర్వేరు గుణాలు, శక్తులు, ప్రత్యేక లక్షణాలతో ప్రసిద్ధులయ్యారని చెబుతారు.

మొదటి తమ్ముడు “మతిమాన్” అని చెబుతారు; ఇతను అపారమైన బుద్ధి, వివేకం, దౌత్యనైపుణ్యం కలిగిన వానరవీరుడిగా చెప్తారు. 

రెండో తమ్ముడు “శ్రుతిమాన్” అని చెబుతారు; ఇతను వేదవేదాంగాలపై పట్టు, జ్యోతిష్యం, ఖగోళజ్ఞానం, సాహిత్యపాండిత్యం కలిగినవాడిగా భక్తులు నమ్ముతారు. 

మూడో తమ్ముడు ”కేతుమాన్” అని చెబుతారు; ఇతను రణరంగంలో పరాక్రమశాలి, ఆయుధవిద్యలో నిపుణుడు, రాక్షసులను ధైర్యంగా ఎదుర్కొన్న యోధుడిగా వర్ణిస్తారు.

నాలుగో తమ్ముడు “గతిమాన్” అని చెబుతారు; ఇతను అపారమైన వేగం, ఆకాశమార్గంలో సంచరించే శక్తి, పర్వతాల్ని సులువుగా అధిరోహించే సామర్థ్యం కలవాడని అంటారు.

ఐదో తమ్ముడు “ధృతిమాన్” అని చెబుతారు; ఇతను  పట్టుదల, ఉత్సాహం, విధేయత, హనుమంతుడిపై అమితమైన అభిమానంతో నిలిచినవాడిగా వర్ణించబడ్డాడు.

ఈ కథనాల ప్రకారం హనుమంతుడు మాత్రమే బ్రహ్మచారిగా ఉండగా, మిగతా ఐదుగురు తమ్ముళ్లు గృహస్థ జీవితాన్ని గడిపారని కూడా చెబుతుంటారు. 

మరికొన్ని ఆధ్యాత్మిక కధల్లో వాయుపుత్రుడైన భీముడినీ హనుమంతుడి సోదరసమానుడిగా భావిస్తారు, వీరిద్దరూ వాయుదేవుని అంశతో జన్మించిన వారు కాబట్టి, వీరిని వాయు పుత్రులు లేదా సవతి సోదరులుగా పిలుస్తారు. 

అందుకే హనుమంతుడి సోదరుల కథ భక్తుల్లో ఆసక్తి రేపుతుంది; అయితే ఇది కొన్ని పురాణ, జానపద కథనాల్లో వినిపించే విశ్వాసం మాత్రమే ఖచ్చితంగా ఉందని చెప్పలేం.