పంచముఖ హనుమంతుడు ఐదు దివ్యముఖాలతో దర్శనమిస్తాడు, ఈ ఐదు ముఖాలు శక్తి, రక్షణ, జ్ఞానం, ధైర్యం, విజయం అనే ప్రత్యేక శక్తులను సూచిస్తాయి.
తూర్పు దిశలో ఉండే హనుమాన్ ముఖం భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక, శత్రువులపై ఎప్పుడూ విజయాన్ని ప్రసాదిస్తుంది.
దక్షిణ దిశలో ఉండే నరసింహ ముఖం భయాలను తొలగించి దుష్టశక్తులను నాశనం చేసి భక్తులను రక్షిస్తుంది. ఇంకా అఖండ శక్తిని ప్రసాదిస్తుంది.
పడమర దిశలో ఉండే గరుడ ముఖం సర్పదోషాలు నివారించి విషప్రభావం తొలగిస్తుంది. భక్తులకు ఎల్లప్పుడూ ఆరోగ్యం, శాంతి ప్రసాదిస్తుంది.
ఉత్తర దిశలో ఉండే వరాహ ముఖం రక్షణ, స్థిరత్వం అందించి, జీవితంలో ఎప్పటికీ తరిగిపోని సంపద, ఐశ్వర్యం కలుగజేస్తుంది
పై భాగంలో ఉండే హయగ్రీవ ముఖం జ్ఞానం, విద్య, బుద్ధి అందించి, ఎల్లప్పుడూ భక్తుల ఆధ్యాత్మిక ప్రగతికి ఆశీర్వాదం అందిస్తుంది.
పంచముఖ రూపం శక్తి సమన్వయాన్ని సూచిస్తుంది. సర్వదిక్కులనుండీ రక్షణ అందించే దివ్యరూపంగా పూజించబడుతుంది.
ఈ రూపం రామాయణ కాలంలో అహిరావణుడిని సంహరించేందుకు అవతరించిన ప్రత్యేక దివ్యరూపంగా పురాణాలు చెబుతున్నాయి.
పంచముఖ హనుమంతుని మనసారా ధ్యానం చేయడం ద్వారా భక్తులకి జీవితంలో భయం తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
పంచముఖ ఆంజనేయుని ఈ ఐదు ముఖాలు పంచభూతాలు, పంచశక్తులు, పంచదిక్కులపై పరిపూర్ణ నియంత్రణను సూచిస్తాయని పురాణాలు చెప్తున్నాయి.