RCW 86 అనే ఈ అవశేషం, దాదాపు 2,000 ఏళ్ల క్రితం జరిగిన సూపర్నోవా ఎక్స్ ప్లోజన్ కి సంబందించింది అని సైంటిస్టులు రికగ్నైజ్ చేశారు.
NASA IXPE, Chandra, XMM-Newton టెలిస్కోప్ల డేటాతో ఈ ప్రాచీన అవశేషాన్ని మళ్లీ రీసర్చ్ చేసి, ఒక హిడెన్ స్ట్రక్చర్ ని బయటపెట్టారు.
RCW 86లో ఒక పెద్ద ఖాళీ గుహ ఉన్నట్టు తెలిసింది. అందుకే పేలుడు తరంగాలు ఊహించినదానికంటే చాలా వేగంగా వ్యాపించాయి.
ఆ గుహను పేలుడు జరగకముందే, ఆ నక్షత్రమే తన చుట్టూ ఉన్న వాయువును తొలగిస్తూ తానే సృష్టించి ఉండొచ్చు అని సైంటిస్టులు చెబుతున్నారు.
IXPE మేజర్ గా ఈ అవశేషం బయటి అంచును గమనించింది. అక్కడ షాక్ తరంగాలు గుహ అంచున ఢీకొని తిరిగి వచ్చినట్లు కనిపించాయి.
ఈ క్యాప్చర్ లో ఎల్లో కలర్లో ఉన్న లో-ఎనర్జీ ఎక్స్రేలు, బ్లూ కలర్లో ఉన్న హై-ఎనర్జీ ఎక్స్రేలు చూపిస్తూ లోపలి స్ట్రక్చర్ ని క్లియర్ గా చూపించారు.
ఆ రిఫ్లెక్టెడ్ షాక్ వల్ల వేడి గ్యాస్ మరింత కంప్రెస్ అయి, బలమైన ఎక్స్రే సిగ్నెల్స్ ప్రొడ్యూస్ అయ్యాయని NASA తెలిపింది.
ఈ అవశేషం భూమికి దాదాపు 8,000 కాంతి సంవత్సరాల దూరంలో, Circinus నక్షత్రరాశి దిశలో ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
185 A.Dలోనే చైనీస్ ఆస్ట్రోనమర్స్ ఆకాశంలో ఒక “guest star” కనిపించిందని రికార్డు చేశారు. అదే ఈ RCW 86తో సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ కొత్త రీసర్చ్ వల్ల RCW 86 కేవలం పాత అవశేషం కాదు, డెత్ స్టార్స్ ఈ యూనివర్స్ ని ఎలా ట్రాన్స్ ఫార్మ్,చేస్తాయో చూపే నేచురల్ లేబొరేటరీగా మారింది.