వ్యక్తి మాట్లాడకముందే అతని బాడీ లాంగ్వేజ్ ని గమనించండి చేతులు కట్టుకుని ఉంటే ఇన్ సెక్యూర్ గా ఫీలై ఉండొచ్చు, ఓపెన్ గా ఉంటే ట్రస్ట్ కలిగి ఉన్నట్లు అర్ధం.
కళ్లలో చూపు ఎలా ఉందో చూడండి నేరుగా చూస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూపిస్తుంది చుట్టుపక్కల చూస్తూ మాట్లాడుతుంటే డిస్ కంఫర్ట్ గా ఉన్నాడని లేదా లయర్ అయ్యే అవకాశం ఉంటుంది.
మాట్లాడే స్పీడ్ గమనించండి చాలా వేగంగా మాట్లాడితే ఫుల్ ఎగ్జైట్ మెంట్ ఉండవచ్చు స్లోగా మాట్లాడితే థింకింగ్ నేచర్ సూచిస్తుంది.
వారి స్మైల్ నేచురల్ గా ఉందా! లేదా గుర్తించండి నిజమైన నవ్వులో కళ్ల మూలలు ముడుచుకుంటాయి నకిలీ నవ్వులో కేవలం పెదవులు కదులుతాయి.
చిన్న ప్రశ్న అడిగి వారి రియాక్షన్ చూడండి వెంటనే సమాధానం ఇస్తే నమ్మకం ఎక్కువ ఆలస్యం అయితే సందేహం లేదా దాచే ప్రయత్నం చేసినట్లు.
వారి టోన్ లో మార్పులు గమనించండి ప్రశాంతంగా ఉంటే స్థిరత్వం ఎక్కువ అకస్మాత్తుగా పెరిగితే ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువ.
ఇతరుల గురించి ఎలా మాట్లాడుతున్నారో వినండి గౌరవంగా మాట్లాడితే మంచి మనసు సూచన విమర్శలు ఎక్కువైతే అసంతృప్తి సూచిస్తుంది.
చేతి కదలికలు గమనించండి ఎక్కువగా కదిపితే ఉత్కంఠ లేదా ఉత్సాహం సూచన, తక్కువ కదలికలు నియంత్రణ లేదా నిశ్చితత్వం సూచిస్తాయి.
వ్యక్తిగత దూరం ఎలా ఉంచుతున్నాడో చూడండి దగ్గరగా వస్తే సౌకర్యం ఎక్కువ దూరంగా ఉంటే అప్రమత్తత లేదా అసౌకర్యం.
మాటల కంటే ప్రవర్తనను ఎక్కువగా గమనించండి మాటలు మోసం చేయవచ్చు కానీ చర్యలు నిజమైన ఉద్దేశాలను స్పష్టంగా బయటపెడతాయి.