రూట్ 66 – (కాలిఫోర్నియా)

చికాగో నుంచి కాలిఫోర్నియా వరకు సాగే రూట్ 66, అమెరికన్ డ్రీమ్ వే. ఈ రోడ్ లో ఉండే పురాతన షాపులు, వింత స్టాచ్యూలు, క్లాసిక్ మోటెల్స్ ఆకర్షణగా ఉంటాయి.

పసిఫిక్ కోస్ట్ హైవే (కాలిఫోర్నియా)

హైవే 1 ద్వారా సాగే ఈ రోడ్ ట్రిప్‌లో సముద్రపు అందాలు, బిగ్ సర్ క్లిఫ్స్, బ్రిడ్జిలు మనల్ని ఆకట్టుకుంటాయి.

బ్లూరిడ్జ్ పార్క్‌వే (నార్త్ కరోలినా)

అపలాచియన్ మలుపుల మార్గం. శాంతియుత అడవులు, మిస్టీ మౌంటెన్స్, వాటర్ ఫాల్స్ మొదలైనవన్నీ చూడటానికి ఇది ఉత్తమ ప్రదేశం.

గ్రేట్ రివర్ రోడ్ (మిసిసిపి నది)

ఈ మార్గం మిసిసిపి నదిని అనుసరిస్తూ సాగుతుంది. చారిత్రక పట్టణాలు, సంగీత వారసత్వం ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.

ఫ్లోరిడా కీస్ ఓవర్సీస్ హైవే

సముద్రంపై నడిచే ఈ రోడ్ ట్రిప్ ఫ్లోరిడా నుండి కీవెస్ట్ వరకు సాగుతుంది. చుట్టూ వాటర్ , మద్య మద్యలో ఇలాండ్స్, సన్‌సెట్‌ ఈ రోడ్ యొక్క స్పెషల్.

అలాస్కా హైవే

అత్యంత అడ్వెంచరస్ రూట్. అద్భుతమైన మంచు శిఖరాలు, అడవులు, జీవజాలం కనిపించే గొప్ప రైడింగ్ ఏరియా.

హైవే 61 – బ్లూస్ హైవే

మ్యూజిక్ లవర్స్ కోసం. న్యూ ఇయర్ లో ప్రారంభమై మెంపిస్ వరకు సాగుతుంది. బ్లూస్ పుట్టినిల్లు కూడా ఇదే. 

ది లోన్ స్టార్ రోడ్ (టెక్సాస్)

టెక్సాస్ భారీ దారులు, పచ్చికలు, కౌబాయ్ కల్చర్‌ను అనుభవించేందుకు ఈ మార్గం సరైనది.

కొలరాడో రాకీ మౌంటెన్ రూట్

టెక్సాస్ భారీ దారుపర్వతాల మధ్య గుండా సాగే రోడ్ ట్రిప్ ఇది. మంచుతో కప్పబడిన శిఖరాలు, సరస్సులు, హైకింగ్ ట్రైల్స్.లు, పచ్చికలు, కౌబాయ్ కల్చర్‌ను అనుభవించేందుకు ఈ మార్గం సరైనది.

డెత్ వాలీ నుంచి యోసెమిటీ 

ఎడారి వేడి నుంచి మంచు పర్వతాలకు ఈ మార్గం మారిపోతూ ఉంటుంది. అనేక ప్రకృతి దృశ్యాలకు కేంద్రం.