చైనీస్ ఆస్ట్రోనమర్స్ విశ్వంలో అసాధారణ లక్షణాలు కలిగిన పల్సర్‌ను గుర్తించారు, ఇది ఇప్పటి వరకు ఉన్న సిద్ధాంతాలను పూర్తిగా సవాలు చేస్తోంది.

ఈ పల్సర్ సాధారణంగా ఉండాల్సిన ఫిజికల్ లిమిటేషన్స్  దాటిపోయి, ఆస్ట్రోనమీలో కొత్త ప్రశ్నలను సృష్టిస్తోంది మరియు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.

పల్సర్ అనేది వేగంగా తిరిగే న్యూట్రాన్ నక్షత్రం. ఇది నిరంతరం రేడియో తరంగాలను విడుదల చేస్తూ, భూమిపై ప్రత్యేక సంకేతాలుగా కనిపిస్తుంది.

కానీ ఈ కొత్త పల్సర్ అసాధారణంగా నెమ్మదిగా తిరుగుతూ కూడా బలమైన సంకేతాలను పంపించడం శాస్త్రవేత్తలకు పెద్ద పజిల్‌గా మారింది.

సాధారణంగా నెమ్మదిగా తిరిగే పల్సర్లు ఇంత పవర్ ఫుల్ సిగ్నల్స్ ఇవ్వవు, కానీ ఇది ఆ రూల్ ని పూర్తిగా బ్రేక్ చేసేసింది.

ఈ పల్సర్ యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ కూడా సాధారణ స్థాయికి భిన్నంగా ఉండటం వల్ల ఇది మరింత విచిత్రంగా కనిపిస్తోంది. 

శాస్త్రవేత్తలు దీన్ని “ఇంపాజిబుల్ పల్సర్” అని పిలుస్తున్నారు, ఎందుకంటే ఇది ప్రస్తుత ఆస్ట్రోనామికల్ థియరీలతో సరిపోలడం లేదు.

ఈ డిస్కవరీ విశ్వంలో ఇంకా తెలియని అనేక రహస్యాలు ఉన్నాయని సూచిస్తూ, ఖగోళ పరిశోధనలకు కొత్త మార్గాన్ని చూపిస్తుంది.

చైనాలోని భారీ రేడియో టెలిస్కోప్ ద్వారా ఈ పల్సర్‌ను గుర్తించడం, ఆధునిక టెక్నాలజీ సామర్థ్యాన్ని నిరూపిస్తోంది.

ఈ పల్సర్ నుంచి వచ్చే సంకేతాలు సమాన అంతరాలతో వస్తూ, ఖచ్చితమైన సమయ గణనకు ఉపయోగపడే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.

ఇలాంటి అసాధారణ పల్సర్లు న్యూట్రాన్ నక్షత్రాల నిర్మాణం, పరిణామంపై ఉన్న సిద్ధాంతాలను తిరిగి పరిశీలించాల్సిన అవసరం కల్పిస్తున్నాయి.

కొందరు శాస్త్రవేత్తలు ఈ పల్సర్ వెనుక కొత్త రకం భౌతిక శక్తులు లేదా తెలియని ప్రక్రియలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఈ ఆవిష్కరణ ద్వారా విశ్వంలోని మోస్ట్ సాలిడ్ మెటీ రియల్స్ బిహేవియర్ పై ఇంకా డీప్ రీసర్చ్ అవసరమని నిర్దారించారు.

చూడబోతే ఈ వింత పల్సర్‌ భవిష్యత్తులో కొత్త ఖగోళ సిద్ధాంతాల రూపకల్పనకు దారి తీసే ముఖ్యమైన ఆవిష్కరణగా మారవచ్చు.

మొత్తానికి, ఈ పల్సర్ విశ్వం ఇంకా మనకు తెలియని ఆశ్చర్యాలతో నిండి ఉందని మళ్లీ గుర్తు చేస్తోంది. అందుకే పరిశోధన కొనసాగుతోంది.