రణథంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్

టైగర్ వ్యూకు పేరుగాంచిన ఈ పార్క్, రాజస్థాన్‌ కోటల మధ్య అడవి మాధుర్యాన్ని అందిస్తుంది. పాత కోటలు, అడవి జంతువులతో నిండిన ప్రకృతి అందాల పర్యటన ఇది.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్  

ఇది భారతదేశపు తొలి నేషనల్ పార్క్. బెంగాల్ టైగర్, ఏలుగులు, ఏనుగులు సహా అనేక వన్యప్రాణులతో కూడిన  అడవి అనుభవం ఇక్కడ లభిస్తుంది.

కాజిరంగ నేషనల్ పార్క్, అస్సాం

ఈ ఫారెస్ట్ ఒంటి కొమ్ము రైనోలకు ప్రసిద్ధి. ఆసియా ఏనుగులు, వందలాది పక్షులతో కూడిన ఈ పార్క్ యునెస్కో ప్రభుత్వ వారసత్వ ప్రదేశం.

గిర్ నేషనల్ పార్క్, గుజరాత్ 

ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఆసియాటిక్ లయన్‌లను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం ఇక్కడే లభిస్తుంది.

సుందర్బన్స్, పశ్చిమ బెంగాల్  

మెగ్నా డెల్టాలో ఉన్న అతిపెద్ద మడ అడవులకు నిలయం ఈ సుందర్బన్స్. టైగర్స్ రిజర్వ్‌, బోటు సఫారీ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

కన్హా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్

ఈ పార్క్ బెంగాల్ టైగర్, ఇండియన్ లియోపార్ద్, బారాసింగ్ జింకలు స్లాత్ బేర్, ఇండియన్ వైల్డ్ డాగ్ ఇండియన్ బైసన్ వంటి అనేక అంతరించిపోతున్న జాతులకు నిలయం.

బంధిపూర్ నేషనల్ పార్క్, కర్ణాటక  

ఈ పార్క్ నైసర్గిక అందాలు, మృగాలు, పక్షులతో పాటు మైసూరు దగ్గర అడవిలో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులకు నిలయం.

పెరియార్ వైల్డ్‌లైఫ్ సాంక్చరీ, కేరళ

శాంతమైన సరస్సు మధ్య బోటు రైడ్‌ చేస్తూ అడవి జంతువులను వీక్షించే సాంప్రదాయ అనుభవం. ఏనుగులు, పులులు, జింకలు కనిపిస్తాయి.

తడోబా నేషనల్ పార్క్, మహారాష్ట్ర  

పులుల పరేడ్‌కు ప్రసిద్ధి. మౌనమైన అడవి వాతావరణంలో జీప్ సఫారీ ద్వారా అడవి జీవులను దగ్గరగా చూడవచ్చు.

హేమిస్ నేషనల్ పార్క్, లడక్

అత్యధిక ఎత్తులో ఉన్న పార్క్. రేర్ స్నో లియోపార్డ్‌లు, పర్వతాలు, శీతాకాల వన్యప్రాణుల వేదికగా ఉండే అరుదైన అనుభవం.