ఇండియన్ స్పేస్ మిషన్ల నుంచి వచ్చిన 129 ట్రాకబుల్ స్పేస్ జంక్ ముక్కలు ప్రస్తుతం అంతరిక్షంలో భూగ్రహం చుట్టూ తిరుగుతూ శాస్త్రవేత్తల్లో యాంగ్జైటీ పెంచుతున్నాయి 

ఈ అంతరిక్ష చెత్తలో పనిచేయని శాటిలైట్స్, రాకెట్ స్పేర్ పార్ట్శ్, పేలిపోయిన మిషన్ల అవశేషాలు ఉండటం వల్ల కక్ష్యలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి 

ఒక చిన్న మెటల్ పీస్ కూడా గంటలకు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ యాక్టివ్ శాటిలైట్లకు ఢీకొట్టే భారీ ముప్పు పొంచి ఉంది.

ఇండియన్ శాటిలైట్ సిస్టమ్స్ కమ్యూనికేషన్, వెదర్ ఫోర్ కాస్ట్, నావిగేషన్, డిఫెన్స్ సర్వీసులకు కీలకం కావడంతో ఈ స్పేస్ జంక్ ముప్పు మరింత సీరియస్ అయింది.

వెల్లడైన వివరాల ప్రకారం ఈ 129 వస్తువుల్లో 49 పనిచేయని శాటిలైట్స్ ఉండగా, మిగతావి రాకెట్ స్పేర్ పార్ట్శ్ మరియు ఇతర బ్రోకెన్ పార్ట్స్.

ముఖ్యంగా PSLV మిషన్లకు చెందిన అవశేషాలే ఎక్కువగా ఉండటం, భారత ప్రయోగాల తర్వాత డెబ్రీస్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేస్తోంది.

స్పేస్ జంక్ పెరిగితే ఫ్యూచర్ లాంచెస్, శాటిలైట్ ప్లేస్మెంట్ , ఆర్బిట్ కరెక్షన్స్ అన్నీ ఖరీదైనవి, క్లిష్టమైనవి కావడంతో అంతరిక్ష కార్యకలాపాలపై ఒత్తిడి పెరుగుతుంది. 

ప్రపంచవ్యాప్తంగా స్పేస్ సస్టైనబులిటీపై చర్చలు పెరుగుతున్న వేళ, భారతదేశం కూడా డెబ్రిస్ ఫ్రీ మిషన్స్  వైపు వేగంగా కదలాల్సిన అవసరం స్పష్టమవుతోంది.

ISRO ఇప్పటికే ట్రాకింగ్ సిస్టమ్స్, మానిటరింగ్ ప్రోగ్రామ్స్, మిటిగేషన్ స్త్రాటజీస్ బలోపేతం చేస్తూ 2030 నాటికి జీరో న్యూ డెబ్రిస్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది. 

అంతరిక్షంలో విజయాలు సాధించిన భారత్, ఇప్పుడు అదే స్థాయిలో స్పేస్ జంక్ కంట్రోల్ లోనూ బాధ్యత చూపించాల్సిన అత్యవసర దశకు చేరుకుంది