మండు మహల్, బుర్హాన్‌పూర్

మండు మహల్ ఓ గోప్యమైన రాజసభ.  షాహ్‌జహాన్ మొదటగా తాజ్ మహల్‌ను ఇక్కడే నిర్మించాలని అనుకున్నాడట. ముంతాజ్ తన తుది రోజుల్ని గడిపిన స్థలం.

గండికోట, ఆంధ్రప్రదేశ్  

ఇండియన్ గ్రాండ్ కెన్యన్ గా ప్రసిద్ధి పొందింది గండికోట. నదీ తీరంలో విశాలమైన లోయలు, ఎత్తైన కొండలు, గుట్టలపై నిర్మించిన  కోట ఇది.  

లోనార్ క్రేటర్, మహారాష్ట్ర

ఈ బిలం 52,000 సంవత్సరాల క్రితం ఓ ఉల్కాపాతం కారణంగా ఏర్పడింది. హాలోఆర్కియా అనే సూక్ష్మజీవుల బయోమాస్ కారణంగా ఇందులోని వాటర్ పింక్ కలర్ లోకి మారుతుంది.

జూలుకి, నాగాలాండ్  

  పర్వతాల మధ్య అడవుల్లో ఉంది జూలుకి గ్రామం. ఇక్కడి జీవ పరిసరాలు అద్భుతంగా ఉంటాయి. చాలా తక్కువగా తెలిసిన  గ్రామం ఇది.

మాజూళి దీవి, అస్సాం

  భారతదేశంలో అతిపెద్ద నదీ ద్వీపం. ఇక్కడి సత్రాలు, నృత్యకళలు మరియు సాంస్కృతిక వారసత్వం పర్యాటకులని అలరిస్తాయి.

త్సో మోరిరి లేక్, లడఖ్  

  పర్వతాల మద్య విస్తారమైన పచ్చని లోయ. బెస్ట్ ట్రెక్కింగ్, బర్డ్ వాచ్ లవర్స్‌కు ఇది నందనవనం.

హళేబీడు, కర్ణాటక

  హోయసల వంశ కాలంలో నిర్మించిన దేవాలయాలు కలిగిన  నగరం. శిల్పకళని చూడాలంటే ఈ ప్రాంతం తప్పక చూడాలి.

ధనుష్కోడి, తమిళనాడు  

  రామసేతు ప్రారంభమైన స్థలం ఇది. గతంలో ఇది సందడిగా ఉండే పట్టణం, ఇప్పుడు శూన్య పట్టణం. మిస్టరీగా మారిన ప్రదేశం.

తమ్హిడి గ్రామం, జమ్మూ & కాశ్మీర్

  పర్యాటకులకు తెలియని ఓ బ్యూటిఫుల్ మౌంటెన్ విలేజ్ ఇది. హిమాలయాల మద్య నిటారుగా  ఉన్న పచ్చని స్వర్గం. 

లేపాక్షి, ఆంధ్రప్రదేశ్

  పురాతన నంది విగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం వేదకాలపు శిల్పకళను చూపిస్తుంది.