మలంపూజ యక్షి విగ్రహం 

మలంపుజా డ్యామ్ సమీపంలోని మలంపుజా గార్డెన్ లో ఉన్న 30 అడుగుల ఎత్తైన నగ్న విగ్రహం. ఇది ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది.

పజాస్సి డ్యామ్ స్త్రీ శిల్పం

కన్నూర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పజాస్సి డ్యామ్ పక్కనే ఉన్న తోటలలో ఉందీ నల్లరాతి విగ్రహం. ఈ డ్యామ్‌కు రాజు పజాస్సి రాజా పేరు పెట్టారు.

శంఘుముఖం బీచ్ వద్ద జలకన్యక

తీరికగా విశ్రాంతి తీసుకుంటున్న ఒక భారీ మత్స్యకన్య విగ్రహం శంఘుముఖం బీచ్‌లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఈ బీచ్ సూర్యాస్తమయం చూసేవారికి ఇష్టమైన ప్రదేశం.

కొల్లం బీచ్ మత్స్యకన్య

కొల్లం బీచ్‌లో మహాత్మా గాంధీ పార్క్‌లో అతిపెద్ద మత్స్యకన్య విగ్రహం ఉంది.ఇది 35 అడుగుల జలకన్య విగ్రహం.

మలంపుజా జెయింట్ ఫిష్

పాలక్కాడ్ సమీపంలోని అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన గార్డెన్ ఒకటి ఉంది. మలంపుజా డ్యామ్‌ సమీపంలోని ఆ గార్డెన్ లో ఒక పెద్ద చేప ఆకారంలో మంచినీటి ఆక్వేరియం ఉంది. 

కురువన్ కురుతి విగ్రహం 

రామక్కల్మేడు ఇడుక్కి జిల్లాలోని హిల్ స్టేషన్ లో 3500 అడుగుల ఎత్తులో కురవన్ మరియు కురతి యొక్క పెద్ద విగ్రహం ఉంది. పెరియార్ టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ సందర్శించే ప్రజలకు ఇది ఇష్టమైన పిక్నిక్ స్పాట్.

ఒరియారం వైద్య కళాశాలలో హృదయ విగ్రహం

రామక్కల్మేడు ఇడుక్కి జిల్లాలోని హిల్ స్టేషన్ లో 3500 అడుగుల ఎత్తులో కురవన్ మరియు కురతి యొక్క పెద్ద విగ్రహం ఉంది. పెరియార్ టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ సందర్శించే ప్రజలకు ఇది ఇష్టమైన పిక్నిక్ స్పాట్.

జటాయు పక్షి శిల్పం

జటాయు పక్షి శిల్పం ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం. ఇది కొల్లంలోని చదయమంగళంలో జటాయు ఎర్త్ సెంటర్ నేచర్ పార్క్ వద్ద ఉంది. ఈ శిల్పం 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు మరియు 70 అడుగుల పొడవు ఉంటుంది.

ఎజిమల హనుమాన్ విగ్రహం

ఎజిమల హనుమాన్ విగ్రహం ఎజిమల కొండలలో ఉన్న 41 అడుగుల ఎత్తైన విగ్రహం. ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహం.

వెలి సరస్సు వద్ద శంఖం శిల్పం 

వెలి సరస్సు వద్ద ఉన్న శంఖు శిల్పం అతి పెద్ద కాంక్రీట్ శిల్పం. ఈ శిల్పం పర్యాటక గ్రామం యొక్క స్పెషల్ ఎట్రాక్షన్.