మెండరిన్‌ఫిష్

మెండరిన్‌ఫిష్ ఎట్రాక్టివ్ కలర్స్ తో కళ్ళు చెదిరే లుక్ తో ఉంటుంది. ఇది బ్లూ, ఆరెంజ్, గ్రీన్ కలర్ మిక్సింగ్ తో ఉండి నేచర్ ఇచ్చిన లివింగ్ ఆర్ట్ లా ఉంటుంది.

క్లౌన్‌ఫిష్

క్లౌన్‌ఫిష్ అనెమోన్‌లలో నివసించే అద్భుత జీవి. వైట్-ఆరెంజ్  కలర్స్ కలిగి ఉంటుంది. దీని నేచురల్ లైఫ్ స్టైల్ వల్ల ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

లీఫీ సీ డ్రాగన్

ఈ ఫిష్ దూది ఆకులా కనిపిస్తుంది. దీని రెక్కలు ఆకులలో కలిసిపోయి ఉంటాయి. టోటల్ గా దీని ఆకారాన్ని చూస్తే ఆకులా అనిపిస్తుందే తప్ప, ఇది ఒక చేప అనిపించదు.

లయన్‌ఫిష్ 

లయన్‌ఫిష్ రెక్కల వలె పొడవైన పంక్తులతో ఆకర్షిస్తుంది. కానీ వీటి ముళ్లలో విషం ఉంటుంది – అందం వెనుక దాగి ఉన్న ప్రమాదం అంటే ఇదేనేమో!

బాంగై కార్డినల్ ఫిష్ 

ఇది చిన్నదైనా, బ్లాక్ అండ్ వైట్ కలయికతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. సముద్రాలలో చాలా అరుదుగా కనిపిస్తుంది.

బ్లూ టాంగ్ 

బ్లూ టాంగ్ ఆకర్షణీయమైన నీలి రంగుతో, ఫిష్ లవర్స్ మనసు దోచుకుంటుంది. చురుకైన స్వభావం ఉంది.

రాయల్ గ్రామా 

ఇది బ్లూ అండ్ పింక్ కలర్స్ లో మెరుస్తూ ఉంటుంది. చిన్నదే అయినా, దాని అందానికి ఆశ్చర్యపోవాల్సిందే.

మూరిష్ ఐడల్  

ఎల్లో, బ్లాక్, వైట్ కలర్స్ తో కలిసిన మూరిష్ ఐడల్ చేప, ఏక్వేరియంలలో ముఖ్యమైన ఆకర్షణగా ఉంటుంది. ఇది చాలా అరుదైనది కూడా.

ప్యారెట్‌ఫిష్  

ప్యారెట్‌ఫిష్ అనేక రకాల రంగులతో కనిపించే చేప. దీని పళ్ళు ఈటెను కూడా ఆపగలిగేంత బలంగా ఉంటాయి..

మాండరిన్ గోబీ 

ఇది మెండరిన్‌ఫిష్ కి దగ్గరగానే ఉంటుంది. రంగుల మేళవింపుతో, దీన్ని చూస్తే కన్ను తిప్పలేరు – డాన్స్ టైప్ లో ఈదే చేప ఇదే!