హిమాలయ గంగాజలము
హిమాలయ పర్వతాల నుండి వచ్చిన గంగానది జలానికి శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయని నమ్మకం. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.
తులసి ఆకుల నీరు
తులసి ఆకులను మరిగించి తాగితే వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలకు ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.
అజ్వయిన్ నీరు
అజ్వైన్ గింజలని మరిగించి తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది గ్యాస్ మరియు ఇతర అజీర్ణ సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.
ధనియాల నీరు
ధనియాలను రాత్రంతా నానబెట్టి, ఆ నీటిని తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది
జీరా నీరు
జీరాను మరిగించి తాగడం ద్వారా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇది పేగుల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
బెల్లం నీరు
బెల్లం కలిపిన నీరు రక్తశుద్ధికి సహాయపడుతుంది. ఇది హిమోగ్లోబిన్ పెరుగుదలకి ఉపయోగపడుతుంది.
గులాబీ నీరు
గులాబీ ఆకుల నుంచి తీసే నీరు చర్మానికి తాజాతనం ఇస్తుంది. ఇది మానసిక శాంతిని కూడా కలిగిస్తుంది.
అశ్వగంధా నీరు
అశ్వగంధ ఓ ఔషధ మూలిక. దీనిని పిడి చేసి నీటిలో కలిపి తీసుకొంటే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది హార్మోన్ల సమతౌల్యాన్ని కూడా కాపాడుతుంది.
నిమ్మకాయ, తేనె, నీరు
ఉదయాన్నే పరగడుపున నీటిలో నిమ్మకాయ, తేనె కలుపుకొని తాగితే శరీరం శుద్ధికావడమే కాదు, బరువు తగ్గించడంలోనూ సహాయపడుతుంది.