ప్రారంభ దశలో భూమిపై వాతావరణం పూర్తిగా వేడి గ్యాస్‌లతో నిండిపోయి ఉండేది. నీటి ఆవిరి ఎక్కువగా ఉండేది, అది మేఘాలుగా మారింది.
సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి చల్లబడటం ప్రారంభమయ్యింది, ఫ్యూమ్ కండెన్స్ అయి వర్షంగా కురవటం మొదలైంది.
ఈ వర్షం కొన్ని రోజులు కాదు, కొన్ని లక్షల సంవత్సరాల పాటు నిరంతరం కురిసినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అలా నిరంతరం కురిసిన వర్షం వల్ల భూమిపై మొదట సముద్రాలు ఏర్పడ్డాయి, ఇవే జీవం పుట్టుకకు ప్రధాన కారణంగా మారాయి.
ఆ సమయంలో భూమిపై నేల స్థిరంగా లేదు, అగ్నిపర్వతాలు ఓవర్ ఫ్లో అవుతూ ఎప్పటికప్పుడు వాతావరణాన్ని మారుస్తూ ఉండేవి.
వర్షం పడే వేళ భూమిపై ఉన్న వేడి కారణంగా ఆ నీరు మళ్లీ ఆవిరై మేఘాలుగా మారి తిరిగి వర్షంగా మళ్ళీ ఈ భూమిపై పడేది.
ఈ వెదర్ సైకిల్ ఇలా లక్షల సంవత్సరాలు కొనసాగి, భూమి మీద నీటి నిల్వలు పెరుగుతూ సముద్రాలు, సరస్సులు ఏర్పడ్డాయి.
ఆ సముద్రాల్లోనే మొదటి సూక్ష్మ జీవులు పుట్టాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు, ఇది జీవ పరిణామానికి మొదటి అడుగు.
ఈ భారీ వర్షాల కాలాన్ని “హైడ్రోస్ఫియర్: ఏర్పడిన దశగా పిలుస్తారు, ఇది భూమి చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం
కాబట్టి లక్షల ఏళ్ల వర్షం లేకపోతే, మనకు తెలిసిన జీవం భూమిపై అసలు ఉనికిలోకి వచ్చేది కాదేమో ఒక్కసారి ఆలోచించండి!