మోహిని ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
విష్ణుమూర్తి' స్త్రీ అవతారం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ!
మోహిని ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ప్రతీ సంవత్సరం
వైశాఖ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశినే మోహిని ఏకాదశి అంటారు. ఈ రోజు విష్ణువును మోహిని రూపంలో పూజిస్తారు భక్తులు
క్షీరసాగర మథనంలో అమృతం పుట్టినప్పుడు, దానిని రాక్షసుల నుండి కాపాడేందుకు విష్ణువు మోహిని అవతారం ధరించాల్సి వచ్చింది అనేది పురాణ కథ
మోహిని అవతారంలో తన అందంతో రాక్షసులను మోహింపజేసి, వారిని పక్కకు నెట్టి.. దేవతలకు అమృతాన్ని పంచిన అద్భుత ఘట్టం జరిగింది ఈ రోజే
ఈ రోజున మోహిని ఏకాదశి వ్రతం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, ముఖ్యంగా తెలిసో తెలియక చేసిన తప్పులు క్షమించబడతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఉదయాన్నే స్నానం చేసి, విష్ణువుకు పసుపు రంగు పూలు, పండ్లు సమర్పించాలి. "ఓం నమో భగవతే వాసుదేవాయ" మంత్రాన్ని జపించాలి.
ఈ రోజున ఉపవాసం పాటిస్తూ ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. కోపం లేకుండా ప్రశాంతంగా ఉండటం వ్రతానికి ముఖ్యమైన నియమంగా భావిస్తారు
మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే శుచిగా స్నానం చేసి, దైవ దర్శనం చేసుకుని సాత్విక ఆహారంతో ఉపవాస దీక్షను విరమించాలి. ఇది సంప్రదాయం గా భావిస్తారు
ఈ పవిత్రమైన రోజున పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల వెయ్యి ఆవులను దానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి
మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వ్రతం ఆచరిస్తే జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయని నమ్మకం.
రామాయణంలో
సీతమ్మ కోసం వెతుకుతున్న సమయంలో శ్రీరాముడు ఈ వ్రతాన్ని ఆచరించారని, తద్వారా ఆయన దుఃఖం తొలగిపోయిందని గ్రంథాలు చెబుతున్నాయి
భారతంలో
ధర్మరాజు కోరిక మేరకు, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఈ మోహిని ఏకాదశి ప్రాముఖ్యతను వివరించి వ్రతం చేయమని సూచించాడని చెబుతారు
విష్ణువు ధరించిన మోహిని అవతారం అంత అందంగా ఉండటంతో శివుడు కూడా ఆ రూపాన్ని చూడాలని తపించారని పురాణాలలో చెప్పబడింది
ఈ ఏకాదశి ఉపవాసం కేవలం ఐహిక సుఖాలే కాకుండా, మరణానంతరం మోక్షాన్ని కూడా ప్రసాదించే గొప్ప శక్తి కలిగిన వ్రతంగా భావిస్తారు
ఈ మోహిని ఏకాదశి మీ అందరి జీవితంలోనూ సంతోషాన్ని, సిరిసంపదలను నింపాలని మనసారా కోరుకుంటూ ఓం నమో నారాయణాయ అంటూ ఈ పవిత్ర కథను ముగిద్దాం