అన్నాబెల్ బొమ్మను తాకినవారికి విచిత్ర ప్రమాదాలు జరిగాయని చెబుతారు; అందుకే దాన్ని ఒక గ్లాస్ బాక్స్ లో ఉంచి మ్యూజియంలో ఉంచారు.
రాబర్ట్ బొమ్మ కళ్లుతిప్పుతుందని, ముఖం మారుతుందని, అనుమతి లేకుండా ఫోటో తీస్తే దురదృష్టం వెంటాడుతుందని ఇప్పటికీ అందరూ నమ్ముతారు అక్కడి మ్యూజియం లేఖలు కూడా దాచుతుంది.
డైబుక్ బాక్స్ ని తెరిచిన తర్వాత భయంకర కలలు, దుర్వాసనలు, అనారోగ్యం మొదలయ్యాయని యజమానులు చెప్పడంతో అది శాపగ్రస్త వస్తువుగా ప్రపంచంలో కీర్తి సంపాదించింది.
హోప్ డైమండ్ చేతులు మారినప్పుడల్లా యజమానుల జీవితాల్లో దురదృష్టం వచ్చిందనే గాథలు పుట్టి, అందమైన రత్నం భయానక పురాణంగా మారిపోయింది.
క్రయింగ్ బాయ్ చిత్రాన్ని ఇంట్లో ఉంచిన ఇళ్లలో అగ్నిప్రమాదాలు జరిగాయని వార్తలు రావడంతో, కాలిపోని పెయింటింగ్ ప్రజల్ని మరింత కలవరపరిచింది బ్రిటన్‌లో ఇది పెద్ద భయంకరమైన కథగా మారింది.
బస్‌బీ కుర్చీలో కూర్చున్నవారికి మరణం సంభవిస్తుందనే ప్రచారంతో, దాన్ని మ్యూజియంలో ఎత్తుగా వేలాడదీసి ఎవ్వరూ తాకలేని శాపకుర్చీగా ఉంచారు.
హ్యాండ్స్ రెసిస్ట్ హిమ్ చిత్రంలోని పిల్లవాడు, బొమ్మ రాత్రిళ్లు కదులుతారనే ఇంటర్నెట్ కథలు రావటంతో దీన్ని డిజిటల్ యుగపు హంటెడ్ కళాఖండంగా నిలబెట్టాయి
బసానో వెండి ఫ్లవర్ వాజ్ పొందిన వారంతా త్వరలో చనిపోయారనే కథ ఉంది. దీంతో అందమైన వస్తువుకూడా శాపం మోస్తుందనే భయాన్ని పెంచింది ప్రపంచవ్యాప్తంగా ఈ గాథ ఇంకా చాలామందిని వణికిస్తుంది.
కోహినూర్ వజ్రాన్ని ధరించిన రాజులకు దురదృష్టం వెంటాడుతుందనే నానుడి ఉంది. రాజసింహాసనాలకే భయాన్ని తెచ్చిన శాపగాథగా ప్రసిద్ధి చెందింది అందుకే ఇది శక్తి కంటే శాపంతో ఎక్కువ గుర్తించబడింది.
ఢిల్లీ పర్పుల్ సఫైర్‌ను దొంగిలించినప్పటి నుంచే దుర్ఘటనలు మొదలయ్యాయనే గాథ, మ్యూజియంలో ఉన్నప్పటికీ దాని మాయను నిలబెట్టింది ఇప్పటికీ చరిత్రలో ఇది అత్యంత భయానక రత్నకథల్లో ఒకటి.