ఇంట్లో వెలిగించే దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక శక్తి, శుభఫలాలు, సానుకూల వాతావరణానికి మూలం అని భావిస్తారు.
హిందూ సంప్రదాయంలో నువ్వుల నూనె దీపం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు, ఇది దోషాలు తొలగించి శుభశక్తిని పెంచుతుంది.
ఆవు నెయ్యితో వెలిగించే దీపం పవిత్రతకు సూచిక, ఇది దేవతా అనుగ్రహాన్ని ఆకర్షిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
సంధ్యాకాలంలో దీపం వెలిగించడం చెడు శక్తులను తొలగించి, ఇంటిలో ప్రశాంతత, ఆనందాన్ని స్థిరపరుస్తుందని నమ్మకం.
ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే ఐశ్వర్యం పెరుగుతుందని, తూర్పు దిశలో వెలిగిస్తే జ్ఞానం అభివృద్ధి అవుతుందని భక్తుల విశ్వాసం.
దీపం ముందు ప్రార్థన చేయడం మనసుకు ఏకాగ్రత, ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగించి ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది.
పంచముఖ దీపం ఐదు ముఖాలు వరుసగా, ఇంట్లో ప్రశాంతత, ఐశ్వర్యం, ఆనందం. శక్తి, శుభాన్ని కలిగిస్తుందని భావిస్తారు.
దీపం జ్వాల పైకి ఎగసిపడడం పురోగతికి సంకేతం అని భావిస్తారు. అది జీవితంలో సానుకూల మార్పులను సూచిస్తుందని చెబుతారు.
ప్రతిరోజూ ఒకే సమయానికి దీపం వెలిగించడం నియమం, క్రమశిక్షణను పెంచి ఆధ్యాత్మిక అనుభూతిని బలపరుస్తుందని నమ్మకం.
మంచి మనసుతో, శ్రద్ధతో వెలిగించిన చిన్న దీపమే అత్యంత శక్తివంతమైనదిగా మారి జీవితంలో వెలుగును నింపుతుంది.